శ్రీవారి సేవలో 'డీజే '
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని డీజే చిత్ర బృందం బుధవారం దర్శించుకుంది.
తిరుమల: ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని డీజే చిత్ర బృందం బుధవారం దర్శించుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న డీజే(దువ్వాడ జగన్నాథం) సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఈ రోజు శ్రీవారిని దర్శించుకుంది. హీరో అల్లు అర్జున్, నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు హరీష్ శంకర్‌తో పాటు చిత్ర యూనిట్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం చిత్ర బృందానికి టీటీడీ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.