ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పూర్తిగా ఫెయిలైంది టీడీపీ ప్రభుత్వమే.. నోటుకు ఓటుతో తెలంగాణలో...
అవి కక్షపూరిత రాతలు
ఎమ్మెల్యే నారాయణస్వామి ధ్వజం
పుత్తూరు : ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పూర్తిగా ఫెయిలైంది టీడీపీ ప్రభుత్వమే.. నోటుకు ఓటుతో తెలంగాణలో ఓ ఎమ్మెల్యేను రూ.5 కోట్లకు బేరమాడి అడ్వాన్సు చెల్లించి అడ్డంగా దొరిపోవడంతో సీఎం చంద్రబాబు అవినీతి గుట్టు రట్టయిందని జీడీ నెల్లూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కళత్తూరు నారాయణస్వామి ధ్వజమెత్తారు. గురువారం పుత్తూరులోని తన స్వగృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలుగా తాను, రోజా ఈ ప్రభుత్వ పాలనను ఎండగట్టామని, అందుకే ఆ పార్టీ అనుకూల పత్రిక తమనే టార్గెట్ చేసిందని, ఈ కక్షపూరిత రాతల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లాలో కలెక్టర్ ఏక పక్షంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేల అభ్యర్థనలను కూడా పట్టించుకోలేదన్నారు.
జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సమస్యలను నిరంతరం తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నానా, లేదా? అనేది ప్రజలకు తెలుసన్నారు.నగరి ఎమ్మెల్యే రోజా ప్రజా ఇప్పటికి ఆమె ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమేనా అంటూ ఆయన సవాల్ విసిరారు. సమావేశంలో చెర్లోపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు కంచి సుబ్రమణ్యం, పీజే.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకుల ఖండన
జీడీనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామిపై వచ్చిన అవాస్తవ కథనంపై పలువురు నాయకులు తీవ్రంగా ఖండించారు. నీతిమాలిన చర్యలకు ఇకనైనా స్వస్తి చెప్పాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి బీ.నరసింహారెడ్డి, రైతు విభాగం పెనుమూరు మండల అధ్యక్షుడు కారేటి గోవిందరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు దూది మోహన్, ఆ పార్టీ ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు శివప్రకాష్‌రాజు, పార్టీ వెదురుకుప్పం మండల పార్టీ అధ్యక్షుడు పేట ధనంజయులురెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రామచంద్రరెడ్డితో పాటు ఎస్సీ సెల్ జిల్లా సంయుక్త ప్రధాన కార్యదర్శి ఆనందయ్య, ఆ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి, గంగాధరనెల్లూరు ఎంపీపీ ప్రగతికరుణాకర్, జెడ్పీటీసీ సభ్యుడు తూగుండ్రం గుణశేఖర్‌మొదలి, గంగాధరనెల్లూరు నియోజకవర్గ అధికారప్రతినిధి వేల్కూరుబాబురెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరకనెల్లూరుకోదండన్, ఎస్‌ఆర్ పురం ఎంపీపీ మోహన్‌కుమార్, మండల కన్వీనర్ అనంతరెడ్డి, తదితరులు హితవు పలికారు. గాంజకి ఎంపీటీసీ సభ్యుడు పుత్తూరు ధనంజయరెడ్డి కార్వేటినగరం పట్టణ యువత అధ్యక్షుడు మధన్‌కుమార్‌రెడ్డి కూడా ఎల్లోమీడియో లో వచ్చిన అవాస్తవ కథనాన్ని ఖండించారు.