‘బోండా ఉమా ఆరోపణలు నిజం కాదు’ | DSP Vijay Bhaskar Reddy Slams on Bonda Umamaheswara Rao | Sakshi
Sakshi News home page

‘బోండా ఉమా ఆరోపణలు నిజం కాదు’

Mar 17 2020 8:45 PM | Updated on Mar 17 2020 8:54 PM

DSP Vijay Bhaskar Reddy Slams on Bonda Umamaheswara Rao - Sakshi

సాక్షి, గుంటూరు: టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వర రావు తీరుపై సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. పోలీసు వ్యవస్థపై బోండా ఉమా చేస్తున్న ఆరోపణలు నిజం కాదన్నారు. మాచర్ల ఘటనపై విచారించేందుకు బోండా ఉమాకు గురజాల డీఎస్పీ నోటీసులు పంపించారని తెలిపారు. విచారణకు రాకుండా తనను చంపడానికి నోటీసు ఇచ్చారనడం ఏంటని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఒక భయానక వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహించారు. (‘మీపై కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం’)

గురజాలలో నమ్మకం లేనప్పుడు పైఅధికారి దగ్గరికి వెళ్లి వాంగ్మూలం ఇవ్వచ్చు కదా అని అన్నారు. అలా కాకుండా గుంటూరు పోలీసులు నిద్రావస్థలో ఉన్నారనటం సరికాదనన్నారు. ఇక మీదట ఎవరైనాసరే పోలీసు వ్యవస్థను కించపరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ విజయభాస్కరరెడ్డి అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement