అంతర్జాతీయ స్థాయిలో తెలుగుకవులకు స్థానం

 Dr Perugu Ramakrishna Presented Book Of The Poetry Of South Asia to International Award Winner Telugu Poet Shiva Reddy - Sakshi

సాక్షి, నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): అంతర్జాతీయ స్థాయిలో ఇద్దరు కవులకు స్థానం లభించడం తెలుగు వారందరికీ గర్వకారణమని సుప్రసిద్ధకవి, జిల్లా వాసి డాక్టర్‌ పెరుగు రామకృష్ణ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన దక్షిణాసియా కవిత సంకలనంలో సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల్లో ఒకరైన శివారెడ్డికి సోమవారం నెల్లూరు నగరంలో పెరుగు రామకృష్ణ సంపాదకీయం వహించి, వెలరించిన ‘దిపొయెట్రి ఆఫ్‌ సౌత్‌ ఏసియా’ పుస్తకాన్ని శివారెడ్డికి అందజేశారు.

ఈ సందర్భంగా పెరుగు మాట్లాడుతూ తొమ్మిది దేశాల కవుల సరసన ఇద్దరు తెలుగు కవులు శివారెడ్డి, పాపినేని శిశంకర్‌ నిలవడం అభినందనీయమన్నారు. సార్క్‌ దేశాల కవులు రాసిన 53 కవితల్లో వీరి కవితలు కూడా ఉండడం తెలుగువారందరికీ గర్వకారణమ న్నారు. తెలుగుభాష కన్వీనర్‌ కూడా అయిన శివారెడ్డి రాసి ప్రచురించిన కవితలతో వారికి తెలుగుకవుల ప్రతిభాపాటవాలు ఇతర భాషా కవులకు తెలియవచ్చిందని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top