శ్రమించారు..సాధించారు ! | done work hard..achieved the goal | Sakshi
Sakshi News home page

శ్రమించారు..సాధించారు !

Aug 17 2013 2:43 AM | Updated on Sep 1 2017 9:52 PM

అధికారులు, సిబ్బంది శ్రమించి సాధించారు. ఎట్టకేలకు రాజీవ్ భీమా ఫేజ్-1 పంప్‌హౌస్ ట్రయల్న్ ్రశుక్రవారం విజయవంతమైంది. ఇక్కడి నుంచి నీటిని భూత్పూర్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు.

మక్తల్, న్యూస్‌లైన్: అధికారులు, సిబ్బంది శ్రమించి సాధించారు. ఎట్టకేలకు రాజీవ్ భీమా ఫేజ్-1 పంప్‌హౌస్ ట్రయల్న్ ్రశుక్రవారం విజయవంతమైంది. ఇక్కడి నుంచి నీటిని భూత్పూర్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. మక్తల్ మండలం చిన్నగోప్లాపూర్ గ్రామం వద్ద నిర్మించిన భీమా మొదటి దశ పంపుహౌస్ మోటార్లను ఈనెల 15న మంత్రి డీకే అరుణ స్విచ్ ఆన్‌చేసి ప్రారంభించగా మోటార్లు మొరాయించిన విషయం తెలిసిందే.. దీంతో ఆమె తీవ్ర నిరాశకు లోనయ్యారు.
 
 సుమారు 24గంటల పాటు శ్రమించిన అధికారులు మోటార్ పంపుల్లో తలెత్తిన సాంకేతికలోపాన్ని సరిచేశారు. గురువారం మంత్రి అరుణ కంప్యూటర్ సిస్టం ద్వారా పంపులను ఆన్‌చేయగా మొరాయించాయి. మోటార్లు ఆన్ కాగానే లోఓల్టేజీ సమస్య తలెత్తింది. దీంతో మోటార్లు డౌన్ కావడంతో పంపులు పనిచేయలేదు. పటేల్ కంపెనీ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది శ్రమించి పంప్‌లను తిరిగి ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ మేరకు భీమాలో అంతర్భాగమైన భూత్పూర్ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోయడానికి చిన్నగోప్లాపూర్ వద్ద నుంచి ఫేజ్-1 పంప్‌హౌస్ నుంచి నీటిని విడుదల చేసినట్లు సంగంబండ ఈఈ శ్రీనివాస్‌రావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
 
 శనివారం ఉదయం వరకు భూత్పూర్ రిజర్వాయర్‌లోకి గ్రావెటీ కెనాల్ ద్వారా నీళ్లు చేరుతాయన్నారు. కార్యక్రమంలో సంగంబండ డిప్యూటీ ఈఈ వెంకటస్వామి, పటేల్ కంపెనీ ప్రతినిధులు కృష్ణారెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా భీమా మొదటిదశ పంప్‌హౌస్ ట్రయల్న్ ్రవిజయవంతం కావడం పట్ల ఈప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా మక్తల్ నియోజకవర్గంలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement