హత్యా, ఆత్మహత్యా అనేది.... తేలాలి | doctor jayachandra cas: after post mortem reports we will say murder or suicide, says Tenali DSP | Sakshi
Sakshi News home page

హత్యా, ఆత్మహత్యా అనేది.... తేలాలి

Oct 28 2014 11:38 AM | Updated on Apr 3 2019 5:34 PM

డాక్టర్ జయచంద్ర మృతిపై విచారణ జరుపుతున్నామని తెనాలి డీఎస్పీ విఠలేశ్వరరావు తెలిపారు.

గుంటూరు : డాక్టర్ జయచంద్ర మృతిపై విచారణ జరుపుతున్నామని తెనాలి డీఎస్పీ విఠలేశ్వరరావు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మిగతా వివరాలు వెల్లడిస్తామని ఆయన మంగళవారమిక్కడ చెప్పారు. జయచంద్రది హత్యా, ఆత్మహత్యా అనేది పోస్ట్మార్టంలో తేలుతుందని డీఎస్పీ వెల్లడించారు. కాగా పది రోజుల క్రితం జయచంద్ర అదృశ్యమైన విషయం తెలిసిందే. అతని  మృతదేహం ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ సమీపంలో దొరికింది.

కాగా గతంలో జయచంద్ర రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. అయితే ఆ విషయాన్ని అతని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు. జయచంద్రకు ఆస్తి తగాదాలతో పాటు, మిత్రులతోనూ వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు... జయచంద్రను హత్యా చేశారా లేక అతనే ఆత్మహత్య చేసుకున్నాడా అనే దిశగా  విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement