'ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి' | do the sc classification: mrps demand | Sakshi
Sakshi News home page

'ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి'

Aug 31 2015 5:02 PM | Updated on Sep 15 2018 3:07 PM

ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. మాదిగ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

శింగనమల (అనంతపురం): ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. మాదిగ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లా శింగనమల తహశీల్దార్ కార్యాలయం ముందు సోమవారం మాదిగా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు పేరూరు శ్రీరాములు ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని.. డప్పు కళాకారులకు నెలకు రూ. 2 వేలు భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement