మోసకారి బాబు | Disruptive Launches | Sakshi
Sakshi News home page

మోసకారి బాబు

Jan 28 2015 2:08 AM | Updated on Aug 29 2018 3:33 PM

మోసకారి బాబు - Sakshi

మోసకారి బాబు

అధికారం తరువాత మాట మార్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఊసరవెల్లిలాంటి వ్యక్తి అని వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శించారు.

బహుమతుల ప్రదానోత్సవ సభలో ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ నేతలు
 
మంగళగిరి : అధికారం తరువాత మాట మార్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఊసరవెల్లిలాంటి వ్యక్తి అని వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శించారు. మండలంలోని చినకాకానిలో మంగళవారం రాత్రి గ్రామ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి ఆటలపోటీల బహుమతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు గంటల పాటు గ్రామంలో ర్యాలీ సాగిన అనంతరం మారుతి ఎస్టేట్స్‌లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ బ్యాంకు రుణాలు చెల్లించవద్దని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తరువాత రైతులు, మహిళలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి భూములు లాక్కోవాలని చూస్తే సహించమన్నారు.
 
గంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తాను అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఇప్పటికీ ప్రజల మనసుల్లో దేవుడిగా నిలవగా,  మోసపు మాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల మనసుల్లో దెయ్యంలా మారారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ అధికారం కోసం ఒక మాట,అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతున్న చంద్రబాబు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారని అన్నారు.

రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కన్వీనర్ పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ అధికారం కోసం చంద్రబాబు చెప్పిన అబద్ధాలు ప్రపంచంలో ఏ నాయకుడు చెప్పలేదన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకొనేది లేదన్నారు. అసెంబ్లీతో పాటు ఏ ఏ ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ నిర్మిస్తారో చెప్పాలన్నారు.

మంగళగిరిలో వైఎస్సార్ సీపీ గెలిచిందనీ, ఆ గ్రామాల భూములు లాక్కునే అధికారం బాబుకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎంపీపీ పచ్చల రత్నకుమారి, పార్టీ నాయకలు ఇక్బాల్ అహ్మద్, తోట శ్రీనివాసరావు, చిల్లపల్లి మోహన్‌రావు, మునగాల మల్లేశ్వరావు, జక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement