breaking news
the YSR Congress leaders
-
మోసకారి బాబు
బహుమతుల ప్రదానోత్సవ సభలో ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ నేతలు మంగళగిరి : అధికారం తరువాత మాట మార్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఊసరవెల్లిలాంటి వ్యక్తి అని వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శించారు. మండలంలోని చినకాకానిలో మంగళవారం రాత్రి గ్రామ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి ఆటలపోటీల బహుమతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు గంటల పాటు గ్రామంలో ర్యాలీ సాగిన అనంతరం మారుతి ఎస్టేట్స్‌లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ బ్యాంకు రుణాలు చెల్లించవద్దని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తరువాత రైతులు, మహిళలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి భూములు లాక్కోవాలని చూస్తే సహించమన్నారు. గంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తాను అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఇప్పటికీ ప్రజల మనసుల్లో దేవుడిగా నిలవగా, మోసపు మాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల మనసుల్లో దెయ్యంలా మారారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ అధికారం కోసం ఒక మాట,అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతున్న చంద్రబాబు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కన్వీనర్ పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ అధికారం కోసం చంద్రబాబు చెప్పిన అబద్ధాలు ప్రపంచంలో ఏ నాయకుడు చెప్పలేదన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకొనేది లేదన్నారు. అసెంబ్లీతో పాటు ఏ ఏ ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ నిర్మిస్తారో చెప్పాలన్నారు. మంగళగిరిలో వైఎస్సార్ సీపీ గెలిచిందనీ, ఆ గ్రామాల భూములు లాక్కునే అధికారం బాబుకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎంపీపీ పచ్చల రత్నకుమారి, పార్టీ నాయకలు ఇక్బాల్ అహ్మద్, తోట శ్రీనివాసరావు, చిల్లపల్లి మోహన్‌రావు, మునగాల మల్లేశ్వరావు, జక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అతివేగం తెచ్చిన తంటా
చౌడేపల్లె: అతివేగం రెండు ప్రాణాలను బలి గొంది. మరొకరిని తీవ్ర గాయాలపాలు చేసిం ది. ఈ ఘటన చౌడేపల్లె-పుంగనూరు మార్గం లోని ఠాణా కొత్తయిండ్లు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. రామసముద్రం మం డలం కొండూరు గ్రామానికి చెందిన సీఆర్.నారాయణరెడ్డి, అతని భార్య శశికళ ఏపీ03 బీజే909 నంబరు గల బొలేరో వాహనంలో తిరుపతిలోని కొడుకు కూతురును చూసేందుకు బయలుదేరారు. అక్కడ మధ్యాహ్నం వరకు గడిపి కొండూరుకు చౌడేపల్లె మీదుగా తిరుగు ప్రయాణమయ్యారు. వాహనం వేగంగా వస్తుండడం, చిన్నపాటి వర్షం పడుతుండడంతో ఠాణాకొత్తయిండ్లు సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పింది. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్న వాహనం అదే వేగంతో లోతైన ప్రదేశంలోకి దూసుకెళ్లింది. పెద్ద శబ్దం రావడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెళ్లి వాహనంలోని ముగ్గురిని బయటకు తీశారు. శశికళ(48) అప్పటికే మృతిచెందింది. తీవ్రగాయాలపాలైన నారాయణరెడ్డి, డ్రైవర్ మాలేనత్తంకు చెందిన సురేంద్రను పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ మృతిచెందాడు. నారాయణరెడ్డిని మెరుగైన వైద్యం కోసం కోలారు మెడికల్ కళాశాలకు తరలించారు. డ్రైవర్‌కు నెలుగు నెలల క్రితం వివాహమైంది. అతని మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి సాగరంలో మునిగి పోయారు. నారాయణరెడ్డి కుదురుచీమనపల్లె సర్పంచ్‌గా పనిచేశారు. వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.