మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రావడాన్ని తాము స్వాగతిస్తామని పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త
ధర్మాన రాకను స్వాగతిస్తాం
Jan 8 2014 2:09 AM | Updated on May 25 2018 9:12 PM
టెక్కలి, న్యూస్‌లైన్: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రావడాన్ని తాము స్వాగతిస్తామని పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. మంగళవారం ఆయన ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ధర్మాన పార్టీలోకి వస్తే విభేదాలు తలెత్తుతాయని కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని అన్నారు.
కలిసికట్టుగా పనిచేసి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయపతాకం ఎగురవేస్తామని చెప్పారు. మహానేత వైఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. మరో నేత చింతాడ గణపతి కూడా ధర్మాన రాకను స్వాగతించారు. సమావేశంలో పార్టీ నాయకులు పోలాకి సోమేశ్వరరావు, తాడి సంపతిరావు, బాడాన మురళి, సిమ్మ సోమేశ్వరరావు, సంపతిరావు రాఘవరావు, దువ్వాడ వాణి, అట్టాడ రవిప్రసాద్, తిర్లంగి జానకిరామయ్య, దేవాది గోపి, బెండి అప్పలసూర్యనారాయణ, బెండి గౌరీపతి, బి.చంద్రరరావు, జి.మోహన్‌రెడ్డి, ఎన్.ఆనంద్, ఎస్.మోహన్‌రావు, బి.కర్మవీరుడు, కె.సూర్యనారాయణ, బి.కామన్న, బోకర నారాయణ, కె.కృష్ణారావు, గడ్డెయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement


