అభిమాన గణం సమేతంగా..ధర్మాన..

Dharmana Prasada Rao Nomination - Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ధర్మాన ప్రసాదరావు... సోమవారం నాడు నగరమంతా ఈ పేరు మార్మోగిపోయింది. వైఎస్సార్‌సీపీ తరఫున శ్రీకాకుళం ఎమ్మె ల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి వెళ్లగా.. శ్రీ కాకుళం మొత్తం ఆయన వెంటే నడిచింది. గార మండలంలోని మారుమూల పల్లెల నుంచి కా ర్పొరేషన్‌ పరిధిలోని వార్డుల వరకు అన్ని వర్గాల వారు ధర్మాన నామినేషన్‌కు తరలివచ్చి వైఎస్సార్‌సీపీ సత్తా చూపించారు. ముందుగా వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయం సోమవారం టౌన్‌హాల్‌ వద్ద దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నామినేషన్‌ ర్యాలీ ప్రారంభించారు. ఎండలు మండిపోతున్నా లెక్క చేయకుండా పార్టీ కార్యకర్తలు, ధర్మాన అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలో పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించిన ర్యాలీ చిన్నబరాటం వీధి గుండా పొట్టి శ్రీరాములు కూడలి నుంచి కిన్నెర థియేటర్‌ మీదుగా జిల్లాపరిషత్‌ మార్గం గుండా వేలాది మందితో ముందు కు కొనసాగింది. అటు అరసవల్లి రోడ్డు మీదుగా 80 అడుగుల రోడ్డు నుంచి ఇటు పొన్నాడ వంతెన నుంచి ఇటు పాతవంతెన మీదుగా అన్నివైపులా జనాలు శ్రీకాకుళం కలెక్టరేట్‌ వైపే అడుగులు వేశా రు. అధికార పార్టీ నాయకులు అడ్డంకులు సృష్టిం చినా జనం ధర్మాన వెనుకే నడిచారు.

ఈ సందర్భంగా నగరంలో సంతోషిమాత గుడి భారీ బహిరంగ నిర్వహించారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రాక్షస పాలనకు చరమగీతం పాడి అందుకు తీర్పునివ్వడానికి మరో 15రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. ఐదేళ్లుగా టీడీపీ ఆగడాలను భరిస్తూ వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. నారాయణ కాలేజీ అధినేత చంద్రబాబు పెట్టుబడిదారుడు నారాయణ కాలేజీలో డబ్బులతో అడ్డంగా దొరికిపోయారని వారిని పోలీసులు తీసుకెళ్లారన్నారు. ప్రతి చోటా వారు డబ్బు సంచీలతో రెడీ అవుతున్నారని తెలిపారు. వృద్ధులకు రూ.3వేలు పెన్షన్‌ ఇస్తానని ఎన్నికల ముందు చెబుతుం డడం విడ్డూరంగా ఉందన్నారు. నమ్మినంతకాలం మోసగించడమే చంద్రబాబు నైజమన్నారు. 15 రోజులు ఎన్నికల యుద్ధంలో సైనికుల్లా పనిచేసినవారంతా రెండు ఓట్లు ధర్మాన, దువ్వాడలకు వేయాలని కోరారు.

సమావేశంలో పార్లమెంట్‌ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి అసెంబ్లీ అభ్యర్థి పేరాడ తిలక్, ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, ఎంవీ పద్మావతి, అంధవరపు వరం, వైవీ సూర్యానారాయణ, శిమ్మ రాజశేఖర్, కేఎల్‌ ప్రసాద్, ఎన్ని ధనుంజయరావు, హనుమంతు కిరణ్‌కుమార్, చల్లా రవికుమార్, మూకళ్ల తాతబాబు, అంబటి శ్రీనివాస్, ఎంవీ స్వరూప్, డీసీఎంఎస్‌ గొండు కృష్ణ, గురుగుబెల్లి లోకనాధం, పొన్నాడ రుషి, పైడి మహేశ్వరరావు, గొండు రఘురాం, పీస శ్రీహరి, మార్పు ధర్మారావు, పీస గోపి, పిఎసిఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, మండవల్లి రవి, కోణార్క్‌ శ్రీను, కోరాడ రమేష్, నక్క రామరాజు, ఆర్‌ఆర్‌మూర్తి, టి.కామేశ్వరి, చల్లా మంజుల, పి. సుగుణారెడ్డిలతో పాటు శ్రీకాకుళం నగరం, రూరల్‌మండలం, గార మండలాల నుంచి భారీగా జనం పాల్గొన్నారు. 

నామినేషన్‌కు ‘మండలం’ తరలివచ్చింది
గార: వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు నామినేషన్‌కు గార మండలమంతా తరలివచ్చింది. సోమవారం ధర్మాన ప్రసాదరావు నామినేషన్‌ వేస్తానని పిలుపునిచ్చిన నేపథ్యంలో స్వచ్ఛందంగా వాహనాలతో జనం తరలివచ్చారు. గార మండలం నుంచి దాదాపు 15 వేల మంది ప్రజలు ఈ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారని అంచనా. మత్స్యకార పంచాయతీలైన పోర్టు కళింగపట్నం, బందరువానిపేట, కొమరవానిపేట, మొగదాలపాడు, వత్సవలస, శ్రీకూర్మం, బలరాంపురం నుంచి మత్స్యకారులు స్వచ్ఛందంగా పాల్గొనడం వైఎస్సార్‌సీపీకి బలాన్నిస్తుందని స్థానికులంటున్నారు. శ్రీకూర్మం నుంచి సుమారు 450 బైక్‌లతో మాజీ సర్పంచ్‌ బరాటం రామశేషు ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top