ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది.
తిరుమల: ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. శనివారం ఉదయం శ్రీవారి దర్శనానికి భక్తులు 23 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడకన వెళ్లే భ క్తులకు 5 గంటల సమయం పడుతోంది.
కాగా శనివారం శ్రీవారిని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో ఆయన స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు.