చిత్తూరు జిల్లా తిరుమలలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు శ్రీవారి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు.
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు శ్రీవారి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. గురువారం ఉదయం శ్రీవారి దర్శనార్థం 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, కానినడకన వచ్చే భక్తులకు 6 గంటలు పడుతోంది. బుధవారం 71,185 మంది భక్తులు శ్రీనివాసుని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.