అదిరింది బొమ్మాళి | designing statues with waste materials | Sakshi
Sakshi News home page

అదిరింది బొమ్మాళి

Jul 22 2015 10:11 AM | Updated on Aug 1 2018 5:04 PM

బైకులు పాడైతే ఎవరైనా ఏం చేస్తారు?. అమ్మేసి మరొకటి కొంటారు.

రాజమండ్రి రూరల్ : బైకులు పాడైతే ఎవరైనా ఏం చేస్తారు?. అమ్మేసి మరొకటి కొంటారు. ఇద్దరు శిల్పులు మాత్రం అలాంటి బైకుల్ని విడదీస్తారు. విడి భాగాలు, నట్లతో అద్భుతమైన బొమ్మలను తయారు చేస్తారు. వారి చేతుల్లో ఒంటెలు, సింహాలు, ఎద్దులు, గుర్రాలు.. ఒకటేమిటి ఎన్నో కళాఖండాలు ఊపిరి పోసుకున్నాయి. వాళ్లే తెనాలికి చెందిన సూర్య శిల్ప శాల శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర .

వీరు రూపొందించిన శిల్పాలను బొమ్మూరు సెంటర్‌లో మంజీర యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్నారు. మైనంతో చేసిన శిల్పాల్లో సజీవత్వం తొణికిసలాడుతోంది. మైనంతో చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శన పుష్కర భక్తుల నుంచి మంచి స్పందన వస్తోందని మంజీర యువజన సంఘాధ్యక్షుడు ముద్దాల అను తెలిపారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement