విశాఖ స్టేషన్ లో పట్టాలు తప్పిన రైలు | derailment in Visakhapatnam train station | Sakshi
Sakshi News home page

విశాఖ స్టేషన్ లో పట్టాలు తప్పిన రైలు

Feb 6 2016 4:29 AM | Updated on Sep 3 2017 5:01 PM

విశాఖ స్టేషన్ లో పట్టాలు తప్పిన రైలు

విశాఖ స్టేషన్ లో పట్టాలు తప్పిన రైలు

విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైలింజన్ పట్టాలు తప్పింది.

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైలింజన్ పట్టాలు తప్పింది. శుక్రవారం ఉదయం 10.45 గంటలకు హౌరా నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్(నం.12863) ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి బయల్దేరింది. సుమారు 200 మీటర్లు ముందుకు వెళ్లాక ఆర్‌ఆర్ కేబిన్ వద్ద రైలింజన్ పట్టాలు తప్పి భూమిలోకి కూరుకుపోయి పక్కకు ఒరిగింది.   ఇంజనీరింగ్ అధికారులు పట్టాలు తప్పిన ఇంజన్‌ను బయటకు తీయించి లోకోషెడ్‌కు తరలించారు. మరో ఇంజిన్‌ను రప్పించి ఎక్స్‌ప్రెస్ రైలును ఎనిమిదో నంబర్ ప్లాట్‌ఫాం మీదకు మార్చారు. అనంతరం రెండు గంటల ఆలస్యంగా రైలు బయల్దేరింది. ప్రమాద ఘటనపై డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ దర్యాప్తునకు ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement