Gujarat: పట్టాలు తప్పిన గూడ్సు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం | Goods Train Wagon Derails in Gujarat's Valsad | Sakshi
Sakshi News home page

Gujarat: పట్టాలు తప్పిన గూడ్సు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Published Sat, Jul 20 2024 1:16 PM | Last Updated on Sat, Jul 20 2024 1:22 PM

Goods Train Wagon Derails in Gujarat's Valsad

గుజరాత్‌లోని వల్సాద్‌లో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగపోయినా, ఈ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ప్రయాణికులు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

గూడ్స్ రైలు సూరత్ వైపు వెళుతుండగా ముంబై-అహ్మదాబాద్ ట్రంక్ మార్గంలో డుంగ్రీ స్టేషన్ సమీపంలో బోగీ ఒకటి అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. అయితే రైలు వేగం ఎక్కువగా లేకపోవడంతో బోగీ బోల్తా పడలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు పట్టాలు తప్పిన కోచ్‌ను ట్రాక్‌పై నుంచి తొలగించి, రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చూశారు. ఘటన ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవలికాలంలో రైలు బోగీలు పట్టాలు తప్పుతున్న కేసులు పెరుగుతుండడంతో రైల్వే అధికారులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈశాన్య రైల్వేలోని బారాబంకి-గోరఖ్‌పూర్ జోన్‌లోని మోతీగంజ్-జిలాహి స్టేషన్ల మధ్య చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎనిమిది బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన పలువురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement