మరింత బలపడిన అల్పపీడనం | Depression more strong in Bay of Bengal | Sakshi
Sakshi News home page

మరింత బలపడిన అల్పపీడనం

Jun 19 2015 1:50 PM | Updated on Sep 3 2017 4:01 AM

ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం మరింత బలపడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది.

విశాఖపట్నం: ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం మరింత బలపడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. అల్పపీడనం రేపటిలోగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. అంతేకాకుండా కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను వాతావరణ కేంద్రం హెచ్చరించింది.    
 

Advertisement
 
Advertisement
Advertisement