విషమంగా మల్లిఖార్జునరెడ్డి ఆరోగ్యం | Declining Health of Mallikarjuna Reddy | Sakshi
Sakshi News home page

విషమంగా మల్లిఖార్జునరెడ్డి ఆరోగ్యం

Aug 29 2013 5:18 PM | Updated on Sep 1 2017 10:14 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆమరణదీక్షకు మద్దతుగా దీక్ష చేస్తున్న ఆయన బంధువు దుర్గాయపల్లి మల్లికార్జునరెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించింది

కడప(వైఎస్ఆర్ జిల్లా):  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆమరణదీక్షకు మద్దతుగా దీక్ష చేస్తున్న ఆయన బంధువు దుర్గాయపల్లి మల్లికార్జునరెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించింది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జగన్‌ దీక్షకు మద్దతుగా ఆయన 4 రోజులుగా  నిరాహార దీక్ష చేస్తున్నారు.  


దీక్ష విరమించాలని వైద్యులు చెప్పినా ఆయన ఖాతరు చేయడంలేదు. జగన్‌ దీక్ష ముగిసే వరకూ తాను దీక్ష విరమించబోనని  మల్లికార్జునరెడ్డి  స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement