న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య 20-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌కు బుధవారం రాత్రి బెట్టింగ్
రాజమహేంద్రవరం క్రైం: న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య 20-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌కు బుధవారం రాత్రి బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు అందిన సమాచారంతో టూటౌన్ సీఐ కె. నాగేశ్వరరావు, సిబ్బందితో కలసి రాజమహేంద్రవరం మొయిన్ రోడ్డులోని మిరియాలవారి వీధిలో ఒక ఇంటిపై దాడి చేసి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి ఆరు సెల్‌ఫోన్‌లు, ఐదు ఏటీఎం కార్డులు, ఒక టీవీ, సోనీ సెట్‌టాప్ బాక్స్, రెండు మోటారు సైకిళ్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 1.5 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. న్యూజిలాండ్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌కు 25మంది బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు తెలిసిందన్నారు. ముద్దాయిలు తెలిపిన వివరాల ప్రకారం మిగిలిన ముద్దాయిల కోసం సీఐ తమ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టి కోటిపల్లి బస్టాండ్ వద్ద గురువారం ముగ్గురిని పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కోసం కోర్టుకు పంపినట్టు సీఐ తెలిపారు. మిగిలిన ముద్దాయిల కోసం గాలిస్తున్నామన్నారు.