సీపీఎం నేత మధు అరెస్ట్, ఉద్రిక్తత

 cpm leader madhu arrested in vijayawada - Sakshi

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాలో మంగళవారం ఉద్రిక్త వాతావారణం నెలకొంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని పెదగొట్టిపాడు దళితుల సమస్యలపై మధు స్పందించారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రజాసంఘాలతో కలిసి గ్రామాన్ని సందర్శించాలనుకున్నారు.

అయితే  సీపీఎం నేతలను పెదగొట్టిపాడుకు వెళ్లనివ్వకుండా పోలీసులు ముందుస్తు అరెస్టులు చేపట్టారు. ఇందులో భాగంగా మధుతో పాటు పలువురు సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top