
సాక్షి, విజయవాడ : వాహనదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న పోలీసులపై సీపీ ద్వారకాతిరుమల రావు కొరడా ఝలిపించారు. వైవీ రావు జంక్షన్ వద్ద చేతివాటం ప్రదర్శించిన వన్ టౌన్ ట్రాఫిక్, టు టౌన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. శాఖాపరమైన విచారణకు సీపీ ఆదేశించారు. డబ్బుల వసూలు వెనక ఎవరి ప్రోద్బలమున్నా చర్యలు తీసుకొంటామని సీపీ ద్వారకాతిరుమల రావు హెచ్చరించారు.