‘నా 20 ఏళ్ల సర్వీసులో ఇలాంటి వ్యక్తిని చూడలేదు’

Covid Task Force committee Chairman Praises CM Jagan - Sakshi

సాక్షి, విజయవాడ : తక్కువ స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నవారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలిస్తామని కోవిడ్‌ 19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణబాబు వెల్లడించారు. , ఇప్పటివరకు 76 కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో మూడు వేల కోవిడ్‌ కేర్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, తర్వాత దశలో ప్రతి జిల్లాలో అయిదు వేలకు పెంచుతామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాకు కోటి రూపాయలతో కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని  వెల్లడించారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఎక్స్‌రే, అంబులెన్స్‌, టాయిలెట్‌ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 74 కోవిడ్‌ ఆస్పత్రుల్లో 5874 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. (అందరికీ పథకాల ఫలాలు దక్కాలి: వైఎస్​ జగన్​)

 అయితే కొన్ని కోవిడ్‌ సెంటర్లలో ఆహారం బాలేదన్న ఫిర్యాదులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి వచ్చాయన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో ఫుడ్ సరఫరాలో ఐఆర్‌టీసీ వాళ్ళ సలహా తీసుకుని పంపిణీకి రెడీ అవుతున్నామని పేర్కొన్నారు. ఫుడ్ విషయంలో వారి అభిప్రాయాలను సేకరిస్తున్నామని, మొత్తం ఆరు అంశాలపై వారి అభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు. డెవలప్‌మెంట్‌కు సంబంధించి జాయింట్‌ కలెక్టర్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అ‍ప్పగించామమన్నారు. కొన్నిచోట్లా పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఈనెల 15 లోపు పంపిచాలని, జూన్ 30 వరకు సంబంధించిన బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని తెలిపారు. (ఈ నెల 15న ఏపీ కేబినెట్‌ భేటీ)

‘రోజుకు అయిదు వందలు రూపాయలు పేషెంట్‌కు ఖర్చు చూస్తున్న సీఎం జగన్‌ చాలా గ్రేట్‌. నా 20 ఏళ్ల సర్వీసులో ఇలాంటి వ్యక్తిని చూడలేదు. ఇక ఇతర రాష్ట్రాలు నుంచి, బయట నుంచి వచ్చే వారిని 10శాతం మాత్రమే పరీక్షలు చేస్తున్నాం. గ్రామ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ పరిధిలో పర్యవేక్షణ చేసే విధంగా మార్పులు తీసుకువస్తున్నాం. 13 నుంచి 15 వేల మంది పైగా ఇతర రాష్ట్రాలు నుంచి వస్తున్నారు. 13 వేల మంది ఇతర దేశాలు నుంచి  రోజుకు నాలుగు చార్టెడ్ ఫ్లైట్స్ ద్వారా అవకాశం ఇచ్చాము. విశాఖలో రెండు, విజయవాడలో రెండు విమానాలకు అవకాశం ఇచ్చాము. గల్ఫ్ దేశాలు నుంచి ఎక్కువగా వచ్చేవారిలో రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఉన్నారు. వీరు తిరుపతి విమానాశ్రయంలో దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణబాబు తెలిపారు. (ఈఎస్ఐ స్కాంలో మ‌రొక‌రి అరెస్ట్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top