కరోనా వైరస్‌: త్రిముఖ వ్యూహం..

Coronavirus Spreading Prevention Depends Upon District Officials At Srikakulam - Sakshi

కలెక్టర్, ఎస్పీ, జేసీకరోనా కట్టడిలో ఈ ముగ్గురే కీలకం

సాక్షి, శ్రీకాకుళం: కరోనా కల్లోలం సృష్టిస్తుంటే జిల్లా వాసులకు ఆ త్రిమూర్తులు అభయమిచ్చారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి సిక్కోలును కరోనా బారి నుంచి కాపాడడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. ము ఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి మధ్యనే గడు పుతూ ప్రజలకు ధైర్యం చెబుతున్నా రు. లాక్‌డౌన్‌లో జనాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగం అంతా చక్క గా పనిచేసినా వారిని సమన్వయపరచుకుని ముందుకెళ్లడంలో కలెక్టర్‌ జె.నివాస్, ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు విజయవంతమయ్యారు. ఈ ము గ్గురు అధికారుల వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రజలకు ఇప్పటివరకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. 

కలెక్టర్‌  చొరవ ప్రశంసనీయం
కరోనా ప్రభావం దేశంలో మొదలైన దగ్గరి నుంచే కలెక్టర్‌ జె.నివాస్‌ అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై కన్నేసి ఉంచారు. అధికారుల దగ్గరి నుంచి వలంటీర్లు, ఆశ కార్యకర్తల వరకు అప్రమత్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారంతా హోమ్‌ క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వారి కదలికలపై నిఘా పెట్టారు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక, వైరస్‌ వ్యాప్తి జోరుగా జరుగుతున్న వేళ స్వయంగా జనంలోకి వచ్చి అప్రమత్తం చేశారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడకూడదని ని త్యావసర సరుకులు, మందులు, కూరగాయలు అందుబాటులోకి తెచ్చారు. నిర్దేశిత ధరలకు ప్రజల దరి చేర్చా రు. లాక్‌డౌన్‌కు ముందు ఒక్కసారిగా విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది రావడంతో వారిని ఊళ్లలోకి పంపించకుండా ప్రత్యేకంగా క్వారంటైన్‌ సెంటర్లు పెట్టారు.

జిల్లాకు 1,445 మంది విదేశాల నుంచి రాగా వారిలో 562 మందిని ప్రత్యేక క్వారంటైన్‌ సెంటర్లలో పెట్టి భోజన, వసతి సదుపాయాలు కల్పించారు. హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వారి బాగోగులు కూడా చూసుకున్నారు. 819 మందికి ఉచితంగా సరుకులు డోర్‌ డెలివరీ చేయించారు. వలస కూలీల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారికి రోజుకో రకం భోజనం పెడుతున్నారు. అనాథలు, నిరాశ్రయులకు కూడా రెడ్‌క్రాస్‌ సాయంతో రోజూ భోజనం పెడుతున్నారు. ప్రభు త్వ ఆదేశాలను క్రమం తప్పకుండా పాటిస్తూ.. సొంత వ్యూహంతో ముందుకువెళ్లారు. ఢిల్లీ ఘటన తర్వాత మరింత అప్రమత్తమయ్యారు. ఇక్కడి ముస్లిం పెద్దలతో సమావేశమై సమస్త వివరాలు తెలుసుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించిన వారి వివరాలు తెలుసుకుని పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు లాక్‌డౌన్‌ కారణంగా గుజరాత్‌ రాష్ట్రంలో చిక్కుకున్న మత్స్యకారులకు అండగా ఓ బృందాన్నే అక్కడకు పంపారు.    

ఎస్పీ అవిశ్రాంత యోధుడు
జనతా కర్ఫ్యూ దగ్గర నుంచి ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక మరింత వేగం పెంచి, రోడ్లపైనే ఎక్కువగా ఉంటున్నారు. కరోనాపై స్వయంగా అవగాహన కలి్ప స్తున్నారు. ప్రధాన కూడళ్లల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోళ్ల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

విధుల్లో ఉన్న పోలీసులకు తగు జాగ్రత్తలు సూచిస్తూ, వారిలో మానసిక స్థైర్యం నింపుతున్నారు. ప్రతి రోజూ పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని పోలీసు స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలకు ముఖ్యమైన ఆదేశాలిస్తూ వస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను ముందుగా గుర్తించి క్వారంటైన్‌లో ఉంచడమే కాకుండా వారు బయటికి రాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌లో రాష్ట్రంలో ప్రతి చోట పోలీసుల తీరుపై కొన్ని విమర్శలు వచ్చినా ఇక్కడా పరిస్థితి ఎక్కడా కనిపించలేదు.

దూసుకుపోతున్న జేసీ  
లాక్‌డౌన్‌ అమల్లోకి రాగానే తిండికి ఇబ్బంది వస్తుందేమోనన్న భయం ప్రతి ఒక్కరికీ పట్టుకుంది. వైరస్‌ వస్తే ఎలా ఉంటుందో తెలీదు గాని తినడానికి తిండి దొరకకపోతే ఇలాగే చనిపోతేమోనన్న ఆందోళన మొదట్లో ఉండేది. కానీ వాటిన్నింటినీ జాయింట్‌ కలెక్టర్‌ శ్రీని వాసులు పటాపంచలు చేశారు.  నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందులు దొరకలేదన్న విమర్శలు రాకుండా చూసుకోగలిగారు.

సామాజిక దూరాన్ని పాటించేలా షాపుల వద్ద చర్య లు తీసుకుంటూనే కూరగాయలు, మొబైల్‌ రైతు బజా ర్లు, కూరగాయలు డోర్‌ డెలివరీ, నిత్యావసర సరుకు లు, మందులు డోర్‌ డెలివరీ ఇలా ప్రతీది ప్రజల వద్దకే తీసుకొచ్చారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, మాంసం ధరలు పెంచకుండా చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ట్రేడర్స్, పౌల్ట్రీ యజమానుల సమావేశమై ధరలపై దిశా నిర్దేశం చేశారు. రబీ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు కూడా చేశారు. వ్యవసాయానికి ఇబ్బందుల్లేకుండా చూడగలిగారు.    

జిల్లా యంత్రాంగం పనితీరు భేష్‌: రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌  
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో కరోనా కేసులు నమోదు కాకపోవడం మన అదృష్టమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో వ్యాధి నియంత్రణలో ఉందని అన్నారు.

శ్రీకాకుళంలో రోడ్డుపై వాహనచోదకులను ఆపి జాగ్రత్తలు చెబుతున్న దాసన్న 
కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం, పోలీస్, వైద్య, రెవెన్యూ శాఖలు స మన్వయంతో చక్కగా పనిచేశాయని ప్రశంసించారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడంతో మీడియా చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అహరి్నశలు ప్రజా సంక్షేమం తపిస్తోందన్నారు. కరోనా కట్టడిలో ఇది కీలక సమయమని, ఇక ముందు కూడా పూర్తి నిబద్ధత పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రింట్‌ అండ్‌ ఎల్రక్టానిక్‌ మీడియా ప్రతినిధులకు బియ్యంతో పాటు నిత్యవసరాల కిట్లను పంపిణీ చేశారు.  

అలాగే సోమవారం శ్రీకాకుళం నగరంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద రోడ్లపై తిరుగుతున్న వారిని మంత్రి ఆపి కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతనే కరోనా నియంత్రణ సాధ్యపడుతుందన్నారు. జిల్లాలో ఒక్క పాటిజివ్‌ కేసు కూడా నమోదు కాలేదని ఇకపై కూడా రాకుండా మనమంతా కలిసికట్టుగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు తెలియజేసి జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

30-05-2020
May 30, 2020, 19:30 IST
న్యూఢిల్లీ: కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నట్టు తెలిసింది. కోవిడ్‌ చికిత్సలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సేవలపై...
30-05-2020
May 30, 2020, 17:42 IST
లాక్‌డౌన్ సడలింపులతోనే నగరాల్లో కరోనా కేసుల సంఖ్య అధికమవుతోందని వెల్లడించారు.
30-05-2020
May 30, 2020, 17:15 IST
అంటే కరోనా కేసులు బయట పడకుండానే పాడె కడుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది.
30-05-2020
May 30, 2020, 17:04 IST
గడిచిన 24 గంటల్లో 114 మంది పోలీసులు కోవిడ్‌ బారిన పడ్డారు. దాంతో రాష్ట్ర పోలీసుల్లో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య...
30-05-2020
May 30, 2020, 16:29 IST
ముంబై: మహమ్మారి కరోనాతో అతలాకుతలమవుతున్న మహారాష్ట్ర శనివారం కాస్త ఊరటనిచ్చే కబురును పంచుకుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా కోవిడ్‌...
30-05-2020
May 30, 2020, 15:55 IST
లక్నో : తన చావుకు లాక్‌డౌన్‌ పొడిగింపే కారణమంటూ ఒక వ్యక్తి సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టి శుక్రవానం రైలు కింద...
30-05-2020
May 30, 2020, 15:17 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరోసారి కరోనా షాక్ తగిలింది. ఎయిరిండియా పైలట్ ఒకరు కరోనా బారిన పడటంతో...
30-05-2020
May 30, 2020, 13:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా  వైరస్ విస్తరణపై భయపడాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్...
30-05-2020
May 30, 2020, 13:49 IST
సాక్షి,అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో శనివారం కొత్తగా 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల...
30-05-2020
May 30, 2020, 13:20 IST
జడ్చర్ల టౌన్‌: జడ్చర్ల గ్రామ పంచాయతీలో మరోమారు కరోనా కలకలం రేగింది. ఉమ్మడి జిల్లాలో తొలి రెండు కేసులు కావేరమ్మపేటలో...
30-05-2020
May 30, 2020, 13:04 IST
సాక్షి, న్యూఢిల్లీ : వాహనదారులకు ఊరటనిచ్చేలా పెట్రోలు కూడా ఇకపై డోర్ డెలివరీ కానుంది. ప్రజల సహాయార్ధం పెట్రోల్ సీఎన్‌జీని ఇంటివద్దకే...
30-05-2020
May 30, 2020, 12:54 IST
నెల్లూరు, తడ: తడ మండలంలో మరోసారి కరోనా కలకలం రేగింది. ఎంపీడీఓ జి.శివయ్య సమాచారం మేరకు తడకండ్రిగ పంచాయతీ పరిధిలోని...
30-05-2020
May 30, 2020, 10:54 IST
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ తన యాంటీ-వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ మార్కెటింగ్ అనుమతి కోరుతూ భారతదేశ డ్రగ్ రెగ్యులేటర్‌కు...
30-05-2020
May 30, 2020, 10:25 IST
చెన్నై,తిరువొత్తియూరు: బిచ్చమెత్తిగా వచ్చిన నగదును ఓ వృద్ధుడు కరోనా నివారణకు సాయంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. శివగంగై సమీపంలోని...
30-05-2020
May 30, 2020, 09:41 IST
లండన్‌: కరోనా సంక్షోభ సమయంలో యూకేలో ప్రజలకు సేవ చేస్తున్న భారతీయ సంతతికి చెందిన ఓ వైద్యుడు హోటల్‌ గదిలో...
30-05-2020
May 30, 2020, 09:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన...
30-05-2020
May 30, 2020, 09:33 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభంగా కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ...
30-05-2020
May 30, 2020, 09:05 IST
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పాత కంటైన్మెంట్ల పరిధిలో కరోనా కేసుల తీవ్రత తగ్గినప్పటికీ...ప్రస్తుతం రోజుకో కొత్త ప్రాంతంలో వైరస్‌ వెలుగు...
30-05-2020
May 30, 2020, 08:49 IST
సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌లో ఉపశమనం కోసం ఏర్పాటు చేసిన క్యాంప్‌లన్నీ ఎత్తివేయడంతో వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.  భవన...
30-05-2020
May 30, 2020, 08:13 IST
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ వృద్ధుల పాలిట శాపంగా మారుతోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారితోపాటు మధుమేహం,హైపర్‌ టెన్షన్‌(బీపీ), నిమోనియా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top