వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో బేల్దారి పని చేసుకుని జీవించే కోగటం పుల్లయ్య(40) సోమవారం ఉదయం వడ దెబ్బకు మృతిచెందాడు.
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో బేల్దారి పని చేసుకుని జీవించే కోగటం పుల్లయ్య(40) సోమవారం ఉదయం వడ దెబ్బకు మృతిచెందాడు. ఎర్రగుంట్ల పట్టణంలోని నడిపూరులో నివాసం ఉంటున్న పుల్లయ్య సోమవారం ఉదయం బేల్దారి పనికి వెళ్లాడు. అక్కడ పనిలో ఉండగానే వడదెబ్బకు కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.