pullaiah
-
మాజీ ఎంపీ దరూర్ పుల్లయ్య కన్నుమూత
వజ్రకరూరు/ ఉరవకొండ: వజ్రకరూరు మండలం ఛాయపురం గ్రామానికి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు దరూర్ పుల్లయ్య (93) కన్నుమూశారు. సోమవారం బళ్లారి సమీపంలోని కంప్లి వద్ద ఉన్న తన వ్యవసాయ క్షేత్రం నుంటి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుకు గురై ఆయన ప్రాణాలు విడిచారు. దరూర్ పుల్లయ్య 1932 జూన్ 20న ఛాయపురం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఈయనకు భార్య సత్యవతితో పాటు కుమారుడు దరూర్ రమేష్, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. మద్రాసులోని లా కళాశాలలో దరూర్ పుల్లయ్య బీఏ, బీఎల్ పూర్తి చేశారు. ఆ తరవాత రాజకీయాల్లోకి ప్రవేశించి 1969 నుంచి 1974 వరకు ఛాయపురం సర్పంచ్‌గా సేవలందించారు. ఆ తర్వాత ఉరవకొండ సమితి అధ్యక్షులుగా పనిచేశారు. 1962 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 1977, 1980 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. 1976 నుంచి 1995 వరకు అనంతపురం ఏపీ లైటింగ్ ఎండీగా, కంప్లి షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్‌గానూ పనిచేశారు. నీటి పారుదల రంగంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన దరూర్ పుల్లయ్య జిల్లాలో తాగు, సాగునీటి కల్పన కోసం కృషి చేశారు. పుల్లయ్య మృతితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
100 కోట్లతో ఉడాయించిన చిట్టీల పుల్లయ్య అరెస్ట్
హైదరాబాద్ : చిట్టీలు, అధిక వడ్డీల ఆశ చూపి ప్రజలను నిలువునా మోసం చేసిన పుల్లయ్య ఆస్తులను సీసీఎస్ పోలీసులు సీజ్ చేశారు. సనత్‌నగర్ బీకేగూడ దాసారం బస్తీ రవీంద్రనగర్ సమీపంలో ఉండే పుల్లయ్య చిట్టీలు, వడ్డీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి..వందల మందిని మోసం చేసిన విషయం విదితమే. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు ఇటీవల బెంగుళూరులో పుల్లయ్యను అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. విచారణలో భాగంగా బుధవారం సాయంత్రం సీసీఎస్ పోలీసులు బీకేగూడలోని నివాసానికి పుల్లయ్యను తీసుకువచ్చారు. ఏసీపీ మల్లికార్జున చౌదరి ఆధ్వర్యంలో పుల్లయ్య తోపాటు అతని ఇద్దరు కుమారులను మూడు గంటల పాటు విచారించి ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నారు. ఐదు అంతస్తుల ఇంటితో పాటు ఫార్చూనర్ కారు, ఇతర సామాగ్రిని సీజ్ చేసి తరలించారు. కాగా ఇంటిపై రూ.60 లక్షల బ్యాంకు లోను ఉన్నట్లు తెలిపారు. కాగా పుల్లయ్యను ఇంటికి తీసుకువచ్చారన్న సమాచారంతో బాధితులు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకుని ఆందోళకు దిగారు. మహిళా బాధితులు కొందరు ఆగ్రహంతో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పుల్లయ్యతో మాట్లాడించాలని వారు పోలీసులతో వాగి్వవాదానికి దిగారు. తిరిగి పుల్లయ్యను సీసీఎస్‌కు తరలించే క్రమంలో పోలీసు వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డు తగిలారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కారు వెంట పరుగెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దశలో పోలీసులు అప్రమత్తమై జనాలను అడ్డుకున్నారు. -
పోరాటయోధుడు గుమ్మి పుల్లన్న మృతి
సాక్షి, వేములవాడ(కరీంనగర్): ఉద్యమనేత, కమ్యూనిస్టు యోధుడు నమిలికొండ పుల్లయ్య ఉరఫ్ గుమ్మి పుల్లన్న(95) ఇకలేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆయన బుధవారం కన్నుమూశారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కమ్యూనిస్టు నాయకులు చాడ వెంకట్‌రెడ్డి, గుంటి వేణు, కడారి రాములు, వేములవాడ మున్సి పల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వైస్‌చైర్మన్ మధు రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు సంతాపం ప్రకటించారు. భూపోరాటమే ఊపిరి.. వేములవాడ బద్దిపోచమ్మవీధిలో పెంకుటింట్లో ఆ యన నివాసం. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన.. విద్యార్థిదశ నుంచే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. చిన్నవయసులోనే వేదాలు, వేదమంత్రాలు నేర్చుకున్న ఆయన.. మెట్రిక్యులేషన్ పాసయ్యారు. తన 16వ ఏట భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. రెండేళ్ల తర్వాత సాయుధ పోరాటం ఎంచుకున్నారు. చివరిదశ వరకూ స్వాతంత్య్ర సమరయోధుడి పింఛన్ మంజూరు కాకపోవడం బాధాకరం. సీనియర్ కమ్యూనిస్టు నేత, స్వాతంత్య్ర సమరయోధుడు సీహెచ్ రాజేశ్వర్‌రావుతో సన్నిహితంగా ఉండేవారు. భూపోరాటాల కోసం ఊరూరా తిరుగుతూ రైతులను జాగృతం చేశారు. గడీలపై జెండాలు ఎగురవేశారు. భూముల్లో ఎర్రజెండాలు పాతారు. సిరిసిల్ల ఠాణాపై దాడి చేసి ఆయుధాలు అపహరించారు. తిమ్మాపూర్ మిలటరీ క్యాంపుపై నాలుగువేల మంది రైతులతో కలిసి దాడి చేసి 110 తుపాకులు ఎత్తుకెళ్లారు. పోలీసుల కంటపడకుండా మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు కాలనడకన చేరుకున్నారు. అక్కడ మూడేళ్లపాటు కోయ, గోండు, నేతకాని, గుత్తికోయలను చైతన్యపరిచి 4 వేల ఎకరాల అటవీ భూములను సాగులోకి తీసుకొచ్చారు. పార్టీ నిర్ణయం మేరకు కరీంనగర్‌కు బదిలీ అయ్యారు. ఇద్దరు కొరియర్ల సాయంతో ధర్మపురిలోని గోదావరి నది వద్దకు చేరుకున్నారు. అక్కడ స్నానాలు చేస్తుండగా పోలీసులు దాడులు చేసి కొరియర్లను చంపేశారు. పులన్నను అరెస్టు చేసి గుల్బర్గా జైలుకు తరలించారు. మూడేళ్ల జైలుజీవనం అనంతరం జనజీవన స్రవంతిలోకి వచ్చారు. చెన్నారెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమంలోనూ పుల్లన్న చురుకుగా పాల్గొన్నారు. ఆయనను తెలంగాణ సాయుధ పోరాటయోధుడిగా గుర్తించి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు సన్మానిస్తూ వస్తున్నారు. పుల్లన్న తల్లిదండ్రులు ఆలియాబాయి–కిష్టయ్య, భార్య రుక్మిణి(చనిపోయారు), కుమారులు పవన్‌కుమార్, మధు మహేశ్, కుమార్తెలు సురేఖ, సునీతతోపాటు 17మంది మనునమలు, మనుమరాండ్రు ఉన్నారు. ఎక్కడికైనా కాలినడకన వెళ్లడం ఆయన ప్రత్యేకత. -
టిక్‌టాక్ వీడియో.. నాన్నొచ్చాడు!
-
మరాఠీ దెయ్యం
ఊరికొసానున్న మంత్రాల పుల్లయ్య ఇంటిముందర కూర్చోని పుల్లలేసినప్పుడంతా కొరివి దెయ్యం తలమంటలా భగ్గునలేస్తున్న చలిమంటవొంకే చూస్తున్నాడు గోవిందు. కడపెళ్లిన నరసప్ప తిరిగిరావడం కోసం సాయంత్రం నుంచి ఎదురుచూస్తా పెద్దూర్‌లోనే ఉండిపోవాల్సొచ్చింది.మామూలుగా ఐతే పెద్దూరొచ్చిన చెర్లోపల్లెవాళ్లంతా వెల్తురుండగానే తిరిగెళ్లిపోతారు. మూడు మైళ్ల దారంతా తోటలు, వంకలు, డొంకలు, రాత్రైతే దెయ్యాల భయం.గోవిందుకు ఇవ్వాల్సిన బెల్లం డబ్బు ఇవ్వకుండా నరసప్ప సంవత్సరం నుంచి తిప్పుకుంటున్నాడు. అది చేతికొస్తే గాని మరుసటి కారుకు విత్తనాలు కొనలేడు గోవిందు.తప్పనిసరై ఉండిపోయాడు.అతనికి అసహనంగా ఉంది.ఆరోజు పట్టుకోకపోతే నరసప్ప మళ్లీ వారందాకా దొరకడు. అమావాస్య చీకటి కమ్ముకుంటావుంది. ఇంకా ఆలస్యమైతే తోడులేకుండా ఒక్కడే వాళ్లవూరు వెళ్లలేడు.‘‘నర్సప్ప రావాల్సిన లాస్ట్ బస్సు అడ్డరోడ్డు కాడికి వచ్చేసింటాదిగదా మామా’’ అడిగాడు గోవిందు, పొలాల్లో గొర్రెల మంద బెరుగ్గా అరవడం, కీచురాళ్ల చప్పుడు పెరగడం గమనిస్తూ.‘‘నీ పెండ్లానికి నీకునాలుగురోజులాయె మాటల్లేవంటాండావు. యేమైండాది?’’ అన్నాడు పుల్లయ్య బీడిని వెలిగిస్తూ.ఎర్రగా మెరుస్తున్న అతని పళ్లు, సారాకళ్లు, జులపాలు, బుర్రమీసాలు చూస్తూ ‘దయ్యం కంటే ఈనేబైంకరంగా వుండాడే’ అనుకున్నాడు గోవిందు.‘నెల్రోజుల్నించి దాని అన్న ఖాయిలాతో కడపాస్పత్రిలో జేరివుండాడు. దాని గొలుసు, గాజులు నాతో మాటైనా చెప్పకుండా వాళ్లన్న కంపించింది.తాళిబొట్టొకటే మిగిలుండాది.ఈతూరి యెరువుల ఖర్చులకు కుదవ నా తలకాయ బెట్టాల్సిందే’’ నిట్టూర్చాడు గోవిందు.‘‘యెట్లైనా నీ పెండ్లానికి ధైర్ణమెక్కువేబ్బీ’’ అన్నాడు బీడి పొగ వదుల్తూ పుల్లయ్య.‘దాని మొఖం. సస్తే సీకట్లో అడుగు బైటపెట్టదు, ఆడోల్ల ధైర్ణాన్ని నువ్వే పొగడాల...ఈరాత్రి ఇంటికి బోయినాక దాని కత వుంది’’అన్నాడు గోవిందు కోపంగా.‘‘నీ పెండ్లామ్మీదైతే వొంటికాలు మీద లేస్తాండావుగానీ, నర్సప్పను దుడ్లు గెట్టిగా అడగాలంటే నీకు బయ్యేం’’ అని నవ్వి–‘‘మనిసికి బయం నరాల మూలాల్లోనే వుంటాది. తెల్సినా నీ వొశంలో వుండదు. బతకి బట్టగట్టాలంటే బయంగూడా అవుసరమబ్బీ’’ అన్నాడు పుల్లయ్య. సగం కాలిన పుల్లల్ని జవిరి కుప్పగా మంటలో వేశాడు గోవిందు. మంట భగ్గుమంది.‘‘అందుకేనేమో నర్సప్ప అందర్నీ ఆడిస్తావుండాడు. మాసువుల్లో యేసిన బెల్లం. వాయన టౌన్లో అమ్ముకొనే ఆర్నెల్లయ్యుండాది. నా దుడ్లు నాకిచ్చేదానికి ఇన్ని తూర్లా తిప్పుకునేది. ఈ పొద్దెట్లైనా బాకీ వసూలు చేస్కోవాల’’ నరసప్ప మిద్దె వైపు చూసి అన్నాడు గోవిందు.ఊరివైపు నుంచి చలిమంట దగ్గరకు నీడలా నడిచొచ్చి నిలబడ్డాడు నరసప్ప పొలాలు చూసుకునే సిలారు.వొంగి మంటకు అరచేతులు పెట్టి ‘‘యేం గోవిందన్నా పెండ్లైనోడివి వూరికి బోకుండా ఈడ దయ్యాలాయన్తో చలిగాచుకుంటా వుండావా. ఇనేవోడుంటే ఈన యెన్ని గ్యాసు దయ్యాలకతలైనా చెప్తాడు’’ అనినవ్వాడు.అతని వైపు చురచురా చూశాడు పుల్లయ్య.‘‘మీ సౌకారొచ్చేది ఆల్చెమౌతాదాబ్బీ’’ అడిగాడు అతని కోసమే చూస్తున్న గోవిందు.‘‘ఆయన అనుకోకండా కడపలోనే కూతురింట్లో నిల్చిపోయినాడు.ఇప్పుడే రాజరత్నం సారు చెప్పిపాయె. మన్నాడొస్తాడంటన్నా’’ అన్నాడు సిలారు చేతులు మొహానికి రుద్దుకుంటూ, గోవిందు నిస్సత్తువగానిట్టూర్చి ‘కత మొదుటికొచ్చింది’ అనుకున్నాడు.‘‘మీవూరోళ్లు రాగిమానుకిందుండిరే’’ అని ఊరివైపు చూసి,‘‘యెళ్లిపోయినట్టుండార్నా. నువ్వు బిన్నే నాలుగడుగులేస్తే అందుకోవచ్చు’’ అని తమ ఇండ్లవైపు వెళ్లిపోయాడు సిలారు.మంట ఆరిపోయి నిప్పురవ్వలు మిగిలాయి.చీకటి కమ్ముకుంది. ‘‘నువ్వు ఇంటికి బొయేట్టుంటే తోడుంటేనే బయల్దేరాది మంచిదిబ్బీ. అమాస్య గడియ లొచ్చేస్తాండాయి. మీవూరి దావలో యాడైనా సమాలిచ్చుకోవచ్చుగానీ అంకాలు మామిడొనం దాటేటప్పుడు మాత్రం ప్రాణం మీది కొస్తాది. ఆడ మర్రిచెట్టు మీద మరాఠీ ఆడదయ్యం శానా యిరుడ్డమైంది, యేషాలేస్తాది. గొంతుచీల్చి రగతం తాగుతాది. మా బోటి మంత్రగాళ్లే తట్టుకోలేరు. పోనీ రాత్రికి మా యింట్లో పండుకోని పొద్దున్నేపోరాదు’’ అని పుల్లయ్య లేచాడు.‘‘సీకట్తోనే రాయారం బోవాల. నాగిరెడ్డి దుడ్లిస్తానన్నాడు. రేప్పొద్దునైతేనే వుంటాడంట. యిత్తనాలకు కసాలగా వుండాది’’ అని–‘‘అరే..ఈ నర్సప్ప ఖయాల్లోబడి మర్చేపోయినా. చెంచయ్యతోట నించి వొకబుట్ట తొమలపాకులు తెమ్మన్నాడు నాగిరెడ్డి. తెల్లార్తోనన్నా బొయ్యి తొమలపాకులు తీస్కోని పరిగెత్తాల. వుత్తచేతుల్తోబోతే యింట్లేకే రానీడు, బోకోపం మనిసి.దయ్యాలని నిల్చిపోతే మనకు జరుగుతదా. పోతా...యెట్టన్నాగానీ....దావలో మావూరోళ్లు యెవురోవొకరు తోడు దొరక్కపోరు’’ అంటూ తనూ లేచి బయల్దేరాడు గోవిందు. గోవిందు కళ్లు చిట్లించి చూస్తూ వడివడిగా నడుస్తున్నాడు. చీకట్లో ముందర మనుషులెళ్తున్నారో లేదో తెలీడం లేదు. వాళ్లవూరోళ్లు కల్సుకునే నామాలోళ్ల కళ్లం దగ్గరకొచ్చాడు.అక్కడ గుడ్డిలాంతరు వెల్తురులో నులకమంచమ్మీద నిద్రపోతున్న వాళ్ల సేద్యగాడు చెవిటి ఓబయ్య తప్ప మరో మనిషి జాడలేదు. సంశయిస్తూ ముందుకు నడిచాడు.అతనికి దెయ్యాల భయం మొదలైంది.‘యెనకరోజుల్లో ఆడోళ్లంతా చెట్టుకు వురేసుకొనో, బావిలో దూకో సచ్చేవాళ్లేమో. రేత్రైతే సాలు చెట్టు కోటి, బావికోటి యేడజూసినా దయ్యాలే. ఇవి మనుసులుగా వున్నప్పుటికంటే సచ్చి దెయ్యాలైనాకే చిన్నప్పబావిగట్టు మీద ఎవరో తెల్లగా కూర్చున్నట్టుంది.వొళ్లు జలదరించింది.అడుగు ముందుకుపడలేదు.పరికించి చూశాడు, అది కొత్తగా బెరడు లేచిపోయిన కానుగచెట్టు మొదలు.ఊపిరిపీల్చుకుని కదిలాడు. నక్కలమడుగు దగ్గరికొచ్చాడు. అక్కణ్ణుంచి దారి వరిమళ్లు వొదిలి తోటల్లో, డొంకలగుండా పోతుంది.‘అమాస్య సీకట్లో ఈ చెట్టుచేమా, కొండావాగూ మనిసివి కాదు, యేరే శక్తుల రాజ్జెం. యెనక్కిపోదామా’ అనుకుని ఓ క్షణం ఆగాడు.పద్దున్నే ఎట్లైనా రాయవరం పోవాలని గుర్తొచ్చింది.బెరుగ్గానే ముందుకు నడిచాడు.అతనికి పుల్లయ్య చెప్పిన భయానక ఘటనలు గుర్తుకొచ్చిభయమెక్కువైంది. చుట్టూ ఉన్నవి వేరేగా మారి కనబడుతున్నాయి. కొండలు నల్లగా మీదికి లేస్తున్నాయి. నక్షత్రాలు గుచ్చి చూస్తున్నాయి. చెట్లు నల్లనిజుట్టు విరబోసుకుని కదుల్తున్నాయి.టెంకాయ తోటల్లోంచి వీస్తున్న కీచురాళ్లతో కలిసి చలికి ఈదురుమంటోంది.మడుగుచుట్టూ కప్పలు, మడుగుపైన అడవిబాతులు, దూరంగా నక్కలు గుంభనగా అరుస్తున్నాయి. చెట్ల సందుల్లో నీడల్లాగా ఏవో ఆకారాలు కదుల్తున్నాయి. నడుస్తూంటే వెనకాలే ఎవరో వస్తూన్న చప్పుడు.ఎవరో నవ్వినట్టు, అంతలోనే ఏడ్చినట్టు, ఎవర్నో పిలిచినట్లు దగ్గర్లో గుసగుసలు. ఎలాగో మడుగును, ఆపైన బడేసాబ్ చెరకుతోటను దాటాడు. అంత చలిలోనూ చెమటలు పట్టాయి.మలుపు తిరిగాక అంతదూరంలో చిక్కగా అంకాలు మామిడివనం కనిపిస్తావుంది.‘ముందుకాలంలో మరాఠీ కుటుంబమొకటి నాటకాలేస్తా తిరగతా ఈవొరొస్తే, వోళ్ల సక్కటి ఆడకూతుర్ని అంకాలొనంలోనే అత్యాచారం జేసినారంట. ఆ పిల్ల ఆణ్ణే సీరతో మర్రిచెట్టుకు ఉరేసుకుని సచ్చిపోయి, దయ్యంగా మారి అమాస్యరేత్రిల్లు ఆ దోవన వొంటరిగా పొయ్యేవాళ్లని రకతం తాగి సంపుతాండాది’అనిచిన్నప్పట్నుంచి వింటున్నది వద్దనుకున్నా గుర్తుకొచ్చింది.అంకాలువనంలోని తాటిచెట్లు, మామిళ్ల మధ్యలో వున్న ఎల్తైన ముసలిమర్రిచెట్టు వికృతంగా అతని కోసం చేతులు సాచినట్టుంది. ఆ పక్కన చెంచయ్య తమలపాకులతోట అతను తప్పించుకోకుండా దడి కట్టినట్టుంది. కుడివైపున నాగమ్మ చెరకుతోట ప్రహరీగోడలాగుంది.ఉన్నట్టుండి గోవిందు నడక ఆగిపోయింది.గుండెలువరసతప్పినాయి.వనం పక్క నుంచి తెల్లని పొట్టి ఆకారం ఎగుడుదిగుడుగా అతనికేసి వస్తోంది.దాని గజ్జలు లయగా మోగుతున్నాయి.భయం కమ్మేసి అడుగులు వెనక్కిపడిబాటపక్కన లోతైన ఎండినకాలవలో పడ్డాడు.కాలిమడమ కలుక్కుమంది.‘‘అబ్బా’’ అన్నాడు.చేతులు నేల మీద ఆన్చి తలెత్తి చూశాడు. ఆ ఆకారం బాట మీద నిలబడి అతని వైపే చూస్తోంది.భయం శక్తినంతా లాగేసింది.గోవిందు కష్టం మీద లేచి బాట పైకెక్కి కుంటుతూ నడక సాగించాడు. భయం నుంచి వొళ్లు ఇంకా స్వాధీనంలోకి రాలేదు. ఎడమవైపు తలతిప్పకుండా బాటకు కుడివైపునడుస్తూమర్రిచెట్టును దాటాడు. అంతే, హఠాత్తుగా నడక మళ్లీ ఆగింది.అంకాలువనానికి చెంచయ్య తోటకు మధ్య సందులోంచి మర్రిచెట్టుకు వైపు నుంచి ఒక ఆకారం బాట మీదికి వస్తోంది.ఈసారిమనిషి ఆకారం. ఆడమనిషి. జుట్టు విరబోసుకుంది. వయ్యారంగా దగ్గరికొస్తావుంది.అది మరాఠీ దెయ్యమే, నా పని ఐపోయింది’ అనుకున్నాడు.అతని వెన్ను నిలువునా వణికింది.నక్షత్రాల వెల్తుర్లో చీర తెల్లగా మెరుస్తావుంది.ఆమె కుడిచేత్తో తమలపాకుల వెదురుబుట్ట పట్టుకుంది.ఆమె ఇరవైఅడుగుల దూరంలో బాట మీదికి వచ్చి ఒక్క క్షణం ఆగింది.పలకరింపుగా నవ్వినట్లు పలువరస చీకట్లో తెల్లగామెరిసింది. గోవిందుకు జల్దరింపు తప్ప ఏమీ తెలియడం లేదు. స్థాణువై నిలబడ్డాడు. చూస్తుండగానే ఆమె విసురుగా అటువైపు తిరిగి వాళ్లవూరి వైపు నడవసాగింది.అతను కళ్లప్పగించి చూస్తూ నిలబడ్డాడు.ఆమె డొంకలోకి తిరిగింది.రెండు నిమిషాల తరువాత కదలిక తెచ్చుకొని అతనూ డొంకలోకి నడిచాడు.రెండు పక్కలా చెట్లతో డొంక పైకప్పులేని పొడవాటి గుహలాగుంది. ఆమె అంతదూరంలో నిద్రలో నడిచేవాళ్లలాగ నడుస్తోంది. బుట్ట నడుం మీద పెట్టుకోడంతో ఆమె నడక ఉయ్యాల ఊగినట్టుంది.ఆమె మలుపు తిరిగింది. అతను డొంకదాటి తిరిగాక ఆమె కనబడలేదు. ‘బాట వొదిలేసి పోయింటాది. తోటలకా పక్క వాగు, వాగవతల తుమ్మచెట్లలో పాడుబడిన యెర్రంరాజు కొట్టాలు. అది పెద్ద దయ్యాలకొంప. ఆడికి పోయుంటుంద’నుకున్నాడు.‘‘ఈపొద్దు నా మీద దేవుడి దయూండాది, మరాఠీరాచ్చసి యెట్లో నన్ను సూడలేదు. సూసింటే ఆణ్ణే సచ్చుండేవాడిని’ అనుకుని కుంటుకుంటూ బాట వెంటబడి ఊరికేసి తిరిగాడు. కాలీడ్చుకుంటూ గోవిందు ఇల్లు చేరేసర్కి అలివేలు నులకమంచం మీద కొడుకును నిద్రపుచ్చుతా వుంది. ఆమెను చూడగానే అతనికి ఒక్కసారిగా నిస్సత్తువ వచ్చి గోడకానుకుని జారి కూర్చుండి పోయాడు.శరీరం వణుకుతావుంది.అలివేలు గాభరగా దగ్గరికొచ్చి చెంప మీద చెయ్యి వేసి చూసి–‘‘జొరంగా వుండాద...యేమయ్యిండాది’’ అనడిగింది.గోవిందు తనకు భార్యతో మాటల్లేవన్న విషయమే మర్చిపోయిఆయాసపడుతూ జరిగిందంతా చెప్పాడు.అతని వైఖరి చూసి అతని వెనకాలే లోపలికొచ్చిన ఎదురింటి గంగమ్మత్త అంతా వినింది.అలివేలు ఏదో చెప్పబోయే లోపలే గంగమ్మత్త గాభరగా ముందుకొచ్చి–‘‘గోయిందు జూసొచ్చింది యెవుర్ననుకుండావ్?’ అంకాలు తోట్లో వుండే మరాఠీదెయ్యాన్ని. అదెట్నో ఈణ్ణి సూళ్లేదు. సూసింటేరగతంగక్కోని ఆణ్ణే పడిపోయుండేవోడు. అది ఈపూట యాడికోపేరంటానికి బోతావుంది. ఈడు బతికి పోయినాడు’’ అని తెగేసి చెప్పి, తలుపు దగ్గరకెళ్లి–‘‘వొరే మహేసూ నువ్వు బేగిపొయ్యి జంగప్పసోమిని బిల్చుకోనిరా...మంత్రమేసి తాయెత్తు గడతాడు...మంగా పసుపునీళ్లు గలపవే...నేను ఆంజనేస్సావమి కుంకం దెస్తా. మల్లేరమ్మ బండారుగుడా వుండాది’’ అంటూ బయటున్న వాళ్లకి అరిచి చెప్పి తన ఇంటివైపు పరుగెత్తింది.అలివేలు భర్తవైపు చూసి పకపకా వ్వింది.గోవిందు అయోమయంగా చూశాడు.‘‘నువ్వు అంకాలొనం కాడ జూసింది నన్నే. మరాఠీదయ్యన్ని గాదు, మల్లేరమ్మ చెల్లెల్నీ గాదు. తొమలపాకుల కోసం బొయినా. నవ్వు నా మీద అలిగుండావని, మాట్లాడవని ఆడ పలకరించలా’’ అనిమూలనున్న తమలపాకుల బుట్టను చూపించింది.ఆమె తలస్నానం జేసుండడాన్ని, కట్టుకున్న సన్నపూల తెల్లచీరను అప్పుడు చూశాడు గోవిందు.‘‘నీకేమైనా మతిబోయిండాదా, ఆడికి వొక్కదానివే యింతరాత్రా పొయ్యేది. యేమన్నా అయ్యుంటే’’ ఆందోళనగా అడిగాడు నిటూరుగా కూర్చొని,గోవిందుకి ఇంకా వణుకు తగ్గలేదు.‘‘నాకేం బయం. ఆ దయ్యంనన్నేంజేస్తాది... నువ్వు తెల్లార్తో లేచి రాయారం నాగిరెడ్డి దెగ్గిరికి బోవాలనుకున్నావుగనా... మీయక్క జెప్పిందిలే.... తొమలపాకులు లేకుండాబోతే ఆయన నీతో మాట్లాడతాడా... అందుకే’’ అంటూ చిన్నగా నవ్వి అలివేలు అతని వీపు మీద చేత్తో రాసి, వాళ్లిద్దరి మధ్యా తగవుకు ఇక తావులేకుండా, అతని తలను తన గుండెలకు మృదువుగా హత్తుకుంది. - డా.కే.వి.రమణారావు -
ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే..
హయత్‌నగర్: వ్యక్తి మృతదేహాన్ని బైక్‌పై అనుమానాస్పదంగా తరలిస్తూ పట్టుబడిన కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని బాలుడితో కలిసి భార్యే అతడిని చంపి.. మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించినట్టు తేల్చారు. బాలుడితో పాటు మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చారు. వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... కోదాడ మార్కెట్ కమిటీలో ఉద్యోగిగా పనిచేసిన మెండెం పుల్లయ్య, ప్రవల్లిక దంపతులకు ఇద్ద రు పిల్లలు. ఆరు నెలల క్రితం వరుసకు మేనల్లుడయ్యే ఓ బాలుడితో ప్రవల్లిక ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. పుల్లయ్యకు ఈ విషయం తెలిసి బాలుడిని హెచ్చరించాడు. అయినా బాలుడు ప్రవల్లిక వద్దకు రావడం మానలేదు. దీంతో పుల్లయ్య భార్యాపిల్లలను తీసుకుని నగరానికి వచ్చి ఎల్బీనగర్ మైత్రినగర్‌లో ఉంటున్నాడు. ఈ నెల 22న పుల్లయ్య ఇంట్లో లేని సమయంలో ఆ బాలుడు వచ్చా డు. 23న ఇంటికి వచ్చిన పుల్లయ్యకు భార్యతో బాలు డు కనిపించాడు. కోపం కట్టలు తెంచుకున్న అతను ఇద్దరినీ కొట్టి.. బాలుడిని తన ఇంటి నుంచి పంపేశాడు. అనంతరం బయటకు వెళ్లి మద్యం తాగి వచ్చాడు. రాత్రి మద్యం మత్తులో ఉన్న పుల్లయ్యను ప్రవల్లిక, బాలుడు కలిసి కొట్టి.. తలను గోడకేసి బాది చంపేశారు. మృతదేహాన్ని ఏం చేయాలో పాలుపోక 24వ తేదీ రాత్రి వరకు వేచి చూశారు. 25న ఆసుపత్రిలో ఉన్న తమ బంధువులను చూసి వస్తామని పక్కింటి వ్యక్తి దగ్గర బైక్ తీసుకున్నారు. రాత్రి 11 గంటలకు నిర్జన ప్రదేశంలో మృతదేహాన్ని పడేద్దామని బైకు మధ్యలో పెట్టుకొని బాలుడు, ప్రవల్లిక బయలుదేరారు. మృతదేహం కాళ్లు వేలాడుతూ కనిపించడంతో పెద్దఅంబర్‌పేట వద్ద పెట్రోలింగ్ పోలీసులు బైక్‌ను ఆపారు. విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. 108 సిబ్బందిని పిలిపించగా బైకు మధ్యలో ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు తేలింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. ప్రవల్లికతో పాటు బాలుడిని తమదైన శైలిలో విచారించగా.. తామే హత్య చేశామని చెప్పారు. దీంతో నిందితులను సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
పిడుగుపడి ఇద్దరు మత్స్యకారుల మృతి
నంద్యాల పట్టణ శివారులోని చిన్న చెరువు వద్ద మత్స్యకారులపై గురువారం పిడుగుపడింది. ఈ ఘటనలో మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన పుల్లయ్య(25), నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన శేఖర్(30) అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
వడదెబ్బకు భవన నిర్మాణ కూలి మృతి
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో బేల్దారి పని చేసుకుని జీవించే కోగటం పుల్లయ్య(40) సోమవారం ఉదయం వడ దెబ్బకు మృతిచెందాడు. ఎర్రగుంట్ల పట్టణంలోని నడిపూరులో నివాసం ఉంటున్న పుల్లయ్య సోమవారం ఉదయం బేల్దారి పనికి వెళ్లాడు. అక్కడ పనిలో ఉండగానే వడదెబ్బకు కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపు
రుద్రవరం: ఆరోగ్యశ్రీ కార్డులేని వారికి కూడా ఇకపై ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు అందిస్తామని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ పుల్లయ్య తెలిపారు. మండలంలోని ఎల్లావత్తుల గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ మెగా వైద్యశిబిరంలో ఆయన మాట్లాడారు. పేదలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో జిల్లాలోని మారుమూల ప్రాంతా ల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 938 రకాల జబ్బులకు కర్నూలు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తో పాటు గౌరి గోపాల్, శాంతిరామ్, క్యూర్, మెడికేర్ ఆస్పత్రి వైద్య సిబ్బంది పాల్గొని పరీక్షలు నిర్వహించారన్నారు. గతంలో ఆరోగ్య శ్రీ కార్డు ఉన్న వారికి మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించే వారని ప్రసుత్తం తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీకి అర్హులన్నారు. రేషన్ కార్డు లేని నిరుపేదలు కూడా సంబంధిత తహశీల్దార్‌తో ధ్రువపత్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారితో రోగి వివరాలను కర్నూలు జనరల్ ఆస్పత్రి సీఎంసీఓసెంటర్‌కు అందంజేస్తే వారికీ ఆరోగ్య శ్రీ పథకం వర్థిస్తుందన్నారు. మరిన్ని వివరాలకు 8333814116, 8333814117 నంబర్లకు పోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. వైద్యశిబిరం విజయవంతం మండలంలోని ఎల్లావత్తుల గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్యశ్రీ మెగా వైద్యశిబిరం విజయవంతం అయింది. డాక్టర్లు రామశర్మ, స్వాతి(శాంతిరామ్ ఆసుపత్రి), వరకుమార్ రెడ్డి(మెడికేర్), త్రినాథ్(గౌరిగోపాల్), మైత్రీ(కర్నూలు ప్రభుత్వాస్పత్రి), డేవిడ్ రాజు(క్యూర్ ఆస్పత్రి)తోపాటు ఆయా ఆసుపత్రిలకు చెందిన వైద్య సిబ్బంది 844 మంది రోగులకు వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. 20 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. శిబిరంలో రుద్రవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి శ్రీమంత్, సిబ్బంది, ఆరోగ్య మిత్ర సభ్యులు విజయ్, మోష పాల్గొన్నారు. -
ఆరోగ్య కేంద్రాలలో ‘ఈ-పీహెచ్సీ’
భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీలోని ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల పనితీరును పరిశీలించేందుకు ‘ఈ-పీహెచ్సీ’ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు ఐటీడీఏ పీఓ వీరపాండియన్ ప్రకటించారు. దీనికి సంబంధించి కార్పొరేట్ ఆసుపత్రులలో ఇప్పటికే అమలవుతున్న సాప్ట్‌వేర్‌ను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో వైద్యం, ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల పనితీరుపై సంబంధిత అధికారులతో ఐటీడీఏ సమావేశపు మందిరంలో శుక్రవారం పీఓ సమీక్ష సమవేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ -పీహెచ్సీ విధానం ద్వారా వైద్యుల పనితీరు మెరుగవుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అందించే వైద్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వైద్యాధికారుల పనితీరును పరిశీలించేందుకు ప్రతి నెలలో రెండో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. పీహెచ్సీలలో ఏర్పాటు చేసిన బర్త్ వెయింటింగ్ రూంలపై గిరిజన గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు సరిపడినన్ని ఐరన్ మాత్రలు ఇవ్వాలన్నారు. ఆశా వర్కర్లకు వేతనాన్ని వారి ఖాతాలలో జమ చేస్తామన్నారు. వైద్యాధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాలని, పీహెచ్సీ భవనాలకు మరమ్మతులు వెంటనే చేయించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పీహెచ్సీలలో మూమెంట్ రిజిస్టర్లను అప్డేట్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పుల్లయ్య, డీఎంఓ డాక్టర్ రాంబాబు పాల్గొన్నారు.