పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై టీడీపీ కుట్రలు | Conspiracy On Postal Ballot Votes | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై టీడీపీ కుట్రలు

Apr 24 2019 6:57 PM | Updated on Apr 24 2019 8:44 PM

Conspiracy On Postal Ballot Votes  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అనంతపురం : టీడీపీ కన్ను ఇప్పుడు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై పడింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లే లక్ష్యంగా టీడీపీ కుట్రలకు తెరలేపింది. కొందరు ప్రభుత్వ అధికారులు టీడీపీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నట్లుగా తెలిసింది. ఓట్లు కొనేందుకు టీడీపీ నాయకులు లక్షల రూపాయలు వెదజల్లుతున్నారు. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న కొందరు ప్రభుత్వ అధికారులు టీడీపీ మద్ధతుదారులైన ఉద్యోగులకు రెండు ఓట్లు జారీ చేశారు. కదిరి, మడకశిర నియోజకవర్గాల్లో ఈ బాగోతం వెలుగుచూసింది.

సుమారు 100 మంది ఉద్యోగులు కదిరిలో రెండుసార్లు ఓట్లు వేశారు. మడకశిరలో 50 మంది ఉద్యోగులకు డబుల్‌ పోస్టల్‌ బ్యాలెట్లు ఇచ్చారు. ఈ విషయం గమనించిన వైఎస్సార్‌సీపీ నేతలు సిద్ధారెడ్డి, తిప్పేస్వామి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఒక్కో ఉద్యోగికి రెండు ఓట్లు జారీ చేసిన అధికారులను వెంటనే సస్పెండ్‌ చేసి, ఆ ఓట్లు చెల్లకుండా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement