కాంగ్రెస్ కు నూకలు చెల్లుతాయి: తులసి రెడ్డి | Congress Leader Tulasi Reddy angry over Congress Party High command | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ కు నూకలు చెల్లుతాయి: తులసి రెడ్డి

Feb 11 2014 6:19 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ కు నూకలు చెల్లుతాయి: తులసి రెడ్డి - Sakshi

కాంగ్రెస్ కు నూకలు చెల్లుతాయి: తులసి రెడ్డి

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు విధించడాన్ని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడప: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు విధించడాన్ని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అంశంలో ప్రజలతోపాటు సొంత పార్టీ శ్రేణులను, నేతలను కాంగ్రెస్ పార్టీ మోసగిస్తోంది అని తులసి రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందుకు వెళితే  ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్‌కు నూకలు చెల్లుతాయని ఆయన జోస్యం చెప్పారు. 
 
సీమాంధ్ర ప్రజల మనోభావాల్ని పట్టించుకోకుండా రాష్ట్రాని విభజిస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుంది అని ఆయన అన్నారు. ఇప్పటికైనా విభజన అంశంపై మరోసారి ఆలోచించాలని పార్టీ హై కమాండ్ కి తులసి రెడ్డి సూచించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement