రీపోలింగ్‌ నిర్వహించాలి

Conduct Re Polling On Saluru Demand For Girijana People - Sakshi

1, 4, పోలింగ్‌ బూత్‌ల పీఓలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి

టీడీపీ నాయకులతో కుమ్మక్కై ఓటు వేయనీయకుండా కుట్ర చేశారు

కొఠియా వివాదాస్పద గ్రామాల గిరిజనుల ఓటర్లకు న్యాయం చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళతాం 

ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ అభ్యర్ది రాజన్నదొర డిమాండ్‌

సాలూరు: సాలూరు మండల పరిధిలోని కొఠియా వివాదాస్పద గ్రామాల గిరిజనులను ఓటేయకుండా అడ్డుకుని తిప్పిపంపిన ఎన్నికల అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు రీపోలింగ్‌ నిర్వహించాలని ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి పీడిక రాజన్నదొర డిమాండ్‌ చేశారు. గురువారం సాయంత్రం నేరెళ్లవలస పోలింగ్‌ కేంద్రంలో తమను ఓటేయనీయకుండా అడ్డుకుని, ఎన్ని కల అధికారులు తిప్పి పంపించారని ఎమ్మెల్యేకు పలువురు గిరిజనులు ఫిర్యాదు చేశారు.

మాజీ సర్పంచ్‌ బీసు ఆధ్వర్యంలో కలిసి తమ వేదన వినిపించారు. స్పందించిన ఎమ్మెల్యే వారితో కలిసి కాలినడకన తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడున్న ఎన్నికల సహాయ రిటర్నింగ్‌ అధికారి కనకారావుకు విషయాన్ని వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒకరిద్దరు ఒడిశాలో ఓటేసినవారు పోలింగ్‌ కేంద్రాలకు వస్తే, అందర్నీ తిప్పి పంపించడం దారుణమన్నారు. గతంలో జరిగి న ఎన్నికల్లో ఒడిశాలో ఓటేసి, ఇక్కడ ఓటేసేందుకు వచ్చేవారని, అలాగే ఇక్కడ ఓటేసి, అక్కడకు కూడా గిరిజనులు వెళ్లేవారన్నారు. ఓటరు స్లిప్పులు, గుర్తింపు కార్డులతో వెళ్లినా ప్రిసైడింగ్‌ అధికారులు ఓటేయనీయకుండా అడ్డుకోవడం ఓటరు ప్రాథమిక హక్కును హరించడమేనన్నారు.

టీడీపీ నాయకులతో కుమ్మక్కై కుట్ర చేశారని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే సుప్రీంకోర్టుకు వెళతామని హెచ్చరించారు. విషయాన్ని రిటర్నింగ్‌ అధికారి సుబ్బారావుకు తెలిపేందుకు ఫోన్‌ చేస్తే ఆయన అందుబాటులోకి రాకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ఆఫ్‌ వస్తోం దన్నారు. చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌కు ఫోన్‌ చేసినా స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరురాష్ట్రాల వివాదం కారణంగా నలి గిపోతున్న అమాయక గిరిజనుల విషయంలో ఇలా వ్యవహరించడం తగదన్నారు. రాజన్నదొర వెంట పార్టీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సూరిబా బు, అర్బన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ పువ్వల నాగేశ్వరరావు తదితరులున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top