అజాత శత్రువుకు కన్నీటి నివాళి | Condolence To YS Vivekananda Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ వివేకా నివాసానికి భారీగా జనం

Mar 16 2019 9:33 AM | Updated on Mar 16 2019 9:54 AM

Condolence To YS Vivekananda Reddy - Sakshi

వైఎస్‌ వివేకానందరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి భారీగా జనం తరలివచ్చారు.

సాక్షి, పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి భారీగా జనం తరలివచ్చారు. ‘అజాత శత్రువు’ను కడసారిగా చూసేందుకు బంధువులు, సన్నిహితులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. సజల నేత్రాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరీ తరం కావడం లేదు. ఊహించని దారుణంతో వైఎస్సార్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

వైఎస్‌ వివేకానందరెడ్డి పార్థీవదేహం వద్ద ఈ ఉదయం కుటుంబ సభ్యులు ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత అంతిమయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో వైఎస్‌ రాజారెడ్డి సమాధి పక్కనే వివేకానందరెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు పులివెందులలో భారీగా భద్రతా బలగాలను మొహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement