గోడ కూలితే.. ఇక అంతే!

Compound Wall Is In Dangerous Situation In Officers Colony In Kadapa - Sakshi

సాక్షి, కడప : కడప నగరం ఎస్పీ బంగ్లా ఎదురుగా గల ఆఫీసర్స్‌ కాలనీలో ఖాళీగా ఉన్న ఓ భవనం ప్రహరీ ఏ క్షణంలోనైనా కూలిపోయేలా ఉంది. ఉత్తరం వైపుగల భవనంలో పూర్వం పట్టు పరిశ్రమ కార్యాలయం ఉండేది. కార్యాలయాన్ని అక్కడి నుంచి తొలగించడంతో చాలా ఏళ్లుగా ఆ భవనం ఉపయోగంలో లేక శిథిల స్థితికి చేరింది. రోడ్డువైపు గల ఆ భవనం ప్రహరీ చీలికలు రావడంతో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అసలే గోడలు వర్షాలకు నాని ఉన్నాయి. ఆపై గోడపై వాలి ఉన్న చెట్టు గాలికి కదిలిన వెంటనే ఆ గోడ కూలేలా ప్రమాదకరమైన స్థితిలో కనిపిస్తోంది. చెట్టుకూడా రోడ్డుపైకి వాలి ఉంది. పెద్దగాలి వస్తే అది కూడా కూలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం జరగకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top