breaking news
Compound Wall
-
గోడ కూలితే.. ఇక అంతే!
సాక్షి, కడప : కడప నగరం ఎస్పీ బంగ్లా ఎదురుగా గల ఆఫీసర్స్ కాలనీలో ఖాళీగా ఉన్న ఓ భవనం ప్రహరీ ఏ క్షణంలోనైనా కూలిపోయేలా ఉంది. ఉత్తరం వైపుగల భవనంలో పూర్వం పట్టు పరిశ్రమ కార్యాలయం ఉండేది. కార్యాలయాన్ని అక్కడి నుంచి తొలగించడంతో చాలా ఏళ్లుగా ఆ భవనం ఉపయోగంలో లేక శిథిల స్థితికి చేరింది. రోడ్డువైపు గల ఆ భవనం ప్రహరీ చీలికలు రావడంతో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అసలే గోడలు వర్షాలకు నాని ఉన్నాయి. ఆపై గోడపై వాలి ఉన్న చెట్టు గాలికి కదిలిన వెంటనే ఆ గోడ కూలేలా ప్రమాదకరమైన స్థితిలో కనిపిస్తోంది. చెట్టుకూడా రోడ్డుపైకి వాలి ఉంది. పెద్దగాలి వస్తే అది కూడా కూలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం జరగకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. -
భయం.. భయంగా..
బాలికలు.. ముఖ్యంగా అనాథలు.. మధ్యలోనే చదువు మానేసిన వారికి బంగారు భవిష్యత్ అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కేజీబీవీల్లో భద్రత గాలిలో దీపంలా మారింది. పర్యవేక్షణ కొరవడడం, సీసీ కెమెరాలు ఉన్నా సరిగా పని చేయకపోవ డం, చాలా చోట్ల ప్రహరీలు నిర్మించకపోవడం వంటి కారణాల వల్ల బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. స్కూళ్లలోకి ఆగంతకులు చొరబడుతున్నారు. స్పెషలాఫీసర్లు నైట్‌డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. చిత్తూరు, సాక్షి: జిల్లా వ్యాప్తంగా 20 కేజీబీవీలున్నాయి. వీటిలో 3840 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. విద్యార్థినులకు తగినట్టు సిబ్బంది లేరు. 20 స్కూళ్లకు 20 మం ది స్పెషలాఫీసర్లు ఉన్నా.. వారిలో చాలా మంది నైట్‌డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. సబ్జెక్టు సీఆర్డీలు 20 మంది, పీఈటీలు 2, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్లు, అకౌంటెంట్ల కొరత వేధిస్తోం ది. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు, స్వీపర్, డే అండ్ నైట్ వాచ్మెన్, కుక్‌లు ఒక్కరు చొప్పున ఖాళీలున్నాయి. మరో ఐదుగురు పీఈటీలు కావాలి. జిల్లా వ్యాప్తంగా 27 ఖాళీలున్నాయి. దీనికి తోడు సిబ్బంది నిర్లక్ష్యం కూడా విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. ఒక్కో కేజీబీవీలో 23 మంది స్టాఫ్ ఉండాలి. వీరిలో 10 మంది టీచింగ్, 13 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి. టీచింగ్ స్టాఫ్‌లో ఒకరు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఒకరురాత్రి పూట విధులు నిర్వర్తించాలి. 23 మందిలో ప్రతి ఒక్కరూ నైట్ డ్యూటీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో స్పెషలాఫీసర్ కూడా నెలలో ఒక రోజు నైట్ డ్యూటీ చేయాలి. ఇవి అమలు కావడం లేదు. తూతూ మంత్రంగా నైట్ డ్యూటీలు చేస్తున్నారు. ఎస్ఓలు కూడా చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారనే విమర్శలున్నాయి. భద్రత గాలికి.. జిల్లాలో శాంతిపురం, రామకుప్పం, గంగవరం, బైరెడ్డిపల్లి, నిమ్మనపల్లి, కురుబలకోట, రామసముద్రం, కేవీబీపురం, గుడుపల్లి, కేవీపల్లి, యర్రావారిపాళ్యంలోని కేజీబీవీలకు ప్రహరీలు లేవు. చాలా స్కూళ్లకు రహదారి సమస్య కూడా ఉంది. వీటి గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ప్రహరీలు లేకపోవడంతో అపరిచిత వ్యక్తులు విద్యాలయాల్లోకి ప్రవేవిశిస్తున్నారని తెలుస్తోంది. ఇది బయటికి పొక్కకుండా స్కూల్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటోంది. కొన్నిచోట్ల ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలోనూ, మరికొన్ని చోట్ల పోలీసు శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవి చాలాచోట్ల పని చేయడం లేదు. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని కేజీబీవీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కేవీబీపురం లాంటి చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. నిమ్మనపల్లి స్కూలు గుట్టపైన ఉంది. దీనికి ప్రహరీ లేకపోవడంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. తనిఖీలు నిర్వర్తించని ఎస్ఎస్ఏ అధికారులు.. ఎస్ఎస్ఏలోని జీసీడీఓ విభాగం అధికారులు నిత్యం కేజీబీవీలను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడి పరిస్థితులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. అయితే వారు చుట్టపు చూపుగా వెళుతున్నందునే కేజీబీవీల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తత్ఫలితంగా బాలికల భద్రత గాలిలో దీపంలా మారిందని విమర్శలున్నాయి. ఇప్పటికైనా ప్రహరీలు, సీసీ కెమెరాలపై శ్రద్ధ పెట్టాలని పలువురు కోరతున్నారు. 10 కేజీబీవీలకు ప్రహరీ గోడలు లేవు జిల్లాలోని 10 కేజీబీవీలకు ప్రహరీ గోడలు లేవు. వాటికి కూడా మంజూరు అయ్యా యి. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు సైతం జరుగుతున్నాయి. కేవీపల్లె కేజీబీవీలో అపరిచిత వ్యక్తులు వెళ్లారని చెప్పడం అబద్ధం. దీన్ని స్పెషల్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాం. స్పెషల్ ఆఫీసర్లందరూ తప్పనిసరిగా కేజీబీవీలను సందర్శించాలి. – శ్యామాలదేవి, జీసీడీఓ -
సోమాజిగూడ ఈనాడు కార్యాలయం వద్ద హైడ్రామా
-
హజ్ కార్యాలయానికీ కాషాయ రంగు
లక్నో: ఉత్తరప్రదేశ్ హజ్ కార్యాలయం ప్రహరీ గోడలు రాత్రికి రాత్రే కాషాయ రంగు సంతరించుకున్నాయి. సెక్రటేరియట్ భవనానికి కాషాయ రంగు వేయించిన కొద్ది రోజులకే సీఎం యోగి దృష్టి హజ్ కార్యాలయంపై పడింది. రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి మొహసిన్ రజాను వివరణ కోరగా.. హజ్ కార్యాలయం ముందు ఉన్న ప్రహరీ గోడలపై మాత్రమే కొత్త రంగు వేశారన్నారు. భవనం వెలుపల, లోపల ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు. అయినా, దీనిని సమస్యగా చేస్తున్నారెందుకని ప్రశ్నించారు. కాషాయం జాతి వ్యతిరేక రంగు కాదు కదా అని అన్నారు. కాంతికి, శక్తికి సంకేతం కాషాయం అని వివరణ ఇచ్చారు. -
లోపం ఎక్కడుంది?
అన్ని వసతులు ఉన్నా విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది టీచర్లను నిలదీసిన పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు హైదరాబాద్: ‘‘నేను మూడు రోజుల క్రితం నల్లగొండ జిల్లా, కొత్తపల్లిలోని శివారెడ్డి గూడెంకు వెళ్లి అక్కడి పాఠశాలలో మీటింగ్ పెట్టాను. అక్కడ అంతా బాగానే ఉంది. ఆరు గదులతో పాఠశాల, కాంపౌండ్ వాల్, తాగునీరు, మూత్రశాలలు ఉన్నాయి. అయితే పిల్లలు ఎంత మంది ఉన్నారని ఆరా తీస్తే 13 మంది అని తేలింది. సరే అక్కడే ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఎంత మంది ఉన్నారు అని తెలుసుకుంటే 410 మంది ఉన్నారని తెలిసింది. మరి లోపం ఎక్కడుంది’’ అని రాష్ట్ర పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు ఉపాధ్యాయులను నిలదీశారు. శనివారం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆవిష్కరణోత్సవానికి వచ్చిన చిరంజీవులు మాట్లాడుతూ ‘మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, ఉచిత పాఠపుస్తకాలు, దుస్తులు, అన్ని సదుపాయాలతో విద్యను అందిస్తున్నాం, అయినా కూడా విద్యార్థుల సంఖ్య తగ్గుతూనే ఉంది’ అని అసహనం వ్యక్తం చేశారు. ఏటా లక్ష నుంచి 1.50 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికనుగుణంగా ఉపాధ్యాయులు మారాలని, పాఠశాలకు సమయానికి రావడంతో పాటు బోధన పద్ధతిలో కూడా కొంత మార్పు తీసుకువచ్చి విద్యార్థుల సంఖ్యను పెంచాలని అన్నారు. రాష్ట్రంలో ఐదు వేల పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయని, వాటిని మూలన పెట్టకుండా విద్యార్థులకు కంప్యూటర్ పాఠాలు చెప్పాలని సూచించారు. -
విద్యానగర్‌లో కార్లపై కూలిన ప్రహారి గోడ
-
ఇంటిపై కూలిన ప్రహారీ గోడ