breaking news
Officers Colony
-
గోడ కూలితే.. ఇక అంతే!
సాక్షి, కడప : కడప నగరం ఎస్పీ బంగ్లా ఎదురుగా గల ఆఫీసర్స్ కాలనీలో ఖాళీగా ఉన్న ఓ భవనం ప్రహరీ ఏ క్షణంలోనైనా కూలిపోయేలా ఉంది. ఉత్తరం వైపుగల భవనంలో పూర్వం పట్టు పరిశ్రమ కార్యాలయం ఉండేది. కార్యాలయాన్ని అక్కడి నుంచి తొలగించడంతో చాలా ఏళ్లుగా ఆ భవనం ఉపయోగంలో లేక శిథిల స్థితికి చేరింది. రోడ్డువైపు గల ఆ భవనం ప్రహరీ చీలికలు రావడంతో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అసలే గోడలు వర్షాలకు నాని ఉన్నాయి. ఆపై గోడపై వాలి ఉన్న చెట్టు గాలికి కదిలిన వెంటనే ఆ గోడ కూలేలా ప్రమాదకరమైన స్థితిలో కనిపిస్తోంది. చెట్టుకూడా రోడ్డుపైకి వాలి ఉంది. పెద్దగాలి వస్తే అది కూడా కూలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం జరగకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పోలీస్ కార్ల ఫ్లాగ్‌పోల్స్ దొంగల అరెస్టు
పంజగుట్ట ఆఫీసర్స్ కాలనీలో ఉన్నతాధికారుల 8 కార్లకు చెందిన బ్రాస్ ఫ్లాగ్‌పోల్స్ తొలగించిన ఇద్దరు నిందితులను, వాటిని కొనుగోలు చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాలప్రకారం ... పంజగుట్ట ఐఏఎస్, ఐపీఎస్ కాలనీలో ఈ నెల 2వ తేదీన 8 మంది ఐఏఎస్ అధికారుల కార్లు బయటపెట్టగా తెల్లారేసరికి వాటికి ఉన్న ప్లాగ్‌పోల్స్ (కారు ముందు భాగంలో జెండా అమర్చే పరికరం) కనిపించకుండా పోయాయి. ఓ ఐఏఎస్ అధికారి కారు డ్రైవర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదే కాలనీలో ఓ ఉన్నతాధికారి ఇంట్లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉండే ఓ మహిళ కొడుకు రాజేష్ ఖన్నా అలియాస్ రాకేష్ (19) బ్యాండ్ కొడుతూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఇతని స్నేహితుడు డి. శ్రీనివాస్‌తో కలిసి ఫ్లాగ్‌పోల్స్ దొంగతనం చేసి ద్వారకాపూరి కాలనీలో స్క్రాప్ దుకాణం నిర్వహించే సుధాకర్‌కు అమ్మారు. దీనిని గుర్తించిన పోలీసులు ఇద్దరు నిందితులను, సుధాకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.