పోలీసు కుటుంబాలకు పరిహారం పంపిణీ | Compensation given to police families | Sakshi
Sakshi News home page

పోలీసు కుటుంబాలకు పరిహారం పంపిణీ

Sep 8 2013 1:29 AM | Updated on Sep 1 2017 10:32 PM

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు రూరల్ ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ శనివారం తన కార్యాలయంలో పరిహారం పంపిణీ చేశారు.

విశాఖపట్నం, న్యూస్‌లైన్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు రూరల్ ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ శనివారం తన కార్యాలయంలో పరిహారం పంపిణీ చేశారు. చీడికాడ పోలీస్ స్టేషన్‌లో పనిచేసి మృతి చెందిన హెచ్‌సీ కె.అప్పన్న భార్య కోడా వెంకటలక్ష్మికి, హుకుంపేట పీఎస్ ఏఎస్‌ఐ ఎన్.సోమయ్య భార్య విజయకుమారికి, మంప పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్ సోబా రాంబాబు భార్య సర్వలక్ష్మిలకు తలో రూ.50 వేలు పంపిణి చేశారు.

అదే విధంగా 2011-12,2012-14 విద్యా సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన సిబ్బంది పిల్లలకు  ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. అనంతరం కంట్రోల్ రూం ఎస్‌ఐ సిహెచ్.రాంబాబు, అనకాపల్లి సీసీఎస్ ఎల్.తాతబ్బాయి, అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన చోటా సాహెబ్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్‌పీ డి.ఎన్.కిశోర్, నర్సీపట్నం ఏఆర్ డీఎస్పీ దామోదర్, ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ సిహెచ్.వివేకానంద, జిల్లా అధ్యక్షుడు జె.వి.ఆర్.సుబ్బరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement