చివరి ఆయకట్టుకూ నీరిస్తాం | collector srikanth assured the formers that their are cultivated | Sakshi
Sakshi News home page

చివరి ఆయకట్టుకూ నీరిస్తాం

Dec 21 2013 3:51 AM | Updated on Sep 2 2017 1:48 AM

కావలి కాలువ, చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ శ్రీకాంత్ రైతులకు భరోసా ఇచ్చారు.

జలదంకి, న్యూస్‌లైన్ : కావలి కాలువ, చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ శ్రీకాంత్ రైతులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన వెంకటేశ్వరపాళెం మేజర్ నుంచి కావలి కాలువపై పర్యటించారు. ఈ సం దర్భంగా కాలువ పరిధిలోని రైతులు సాగునీటి ఎద్దడిపై కలెక్టర్ దృష్టికి తెచ్చా రు.  కావలి కాలువకు విడుదలవుతున్న నీటి ప్రవాహం, వెంకటేశ్వరపాళెం మేజర్ కు వస్తున్న నీటి ప్రవాహాన్ని కొలతలు వేసి తెలుసుకున్నారు. చినక్రాక వద్ద కావ లి కాలువ ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు వెళుతున్న నీటి ప్రవాహాన్ని పరి శీలించారు. ఎస్వీపీఎం వద్ద కావలి కాలువకు 200 క్యూసెక్కుల నీరు వస్తుండగా, చినక్రాక వద్దకు వచ్చే సరికి 100 క్యూసెక్కుల మేర మాత్రమే నీరు వస్తున్న విషయాన్ని గమనించారు. ఇలా అయితే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీరు వచ్చే పరిస్థితి లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో కలెక్టర్ సంగం బ్యారేజీ వద్ద నీటి మట్టం మరింతగా పెంచి కాలువలోకి నీటి సామర్థ్యాన్ని పెంచాలని ఫోన్‌లోనే సోమశిల అధికారులను ఆదేశిం చారు. అనంతరం హనుమకొండపాళెం, బ్రాహ్మణక్రాక మేజర్ రైతులు తమ పొ లాలు ఎండుతున్నాయని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన ఆ రెండు మేజ ర్ల పరిధిలోని ఎండిన పంట పొలాలను పరిశీలించారు. హనుమకొండపాళెం మేజర్ నుంచి చెరువుకు 50 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే తమ బాధలు తీరుతాయని రైతులు కోరారు. జలదంకి పెద్దచెరువు పరిధిలో కూడా పొలాలు ఎండుతున్న విషయాన్ని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
 
 ఒకటి..రెండు రోజుల్లో రైతుల ఆందోళన తీరుస్తామన్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా ఇవ్వండి మండలంలోని కొత్తపాళెం ఫీడర్‌కు వి ద్యుత్ సరఫరా సక్రమంగా ఇవ్వాలని కలెక్టర్ శ్రీకాంత్ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొత్తపాళెం ఫీడర్‌కు చెందిన రైతులు బ్రాహ్మణక్రాక సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టర్ చినక్రాకకు వెళుతూ సబ్‌స్టేషన్ ఎదు ట రైతులు ఆందోళన గమనించి ఆగి వారిని ప్రశ్నించారు. పది రోజుల నుంచి  కరెంటు సరఫరా సక్రమంగా ఇవ్వడం లేదని, దీంతో తమ పొలాలు ఎండుతున్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలెక్టర్ కరెంట్ సక్రమంగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటూ ట్రాన్స్‌కో ఏఈ గోపీని ప్రశ్నిం చారు.
 
 తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, ఫ్యూజులు, జంపర్లు పోతుండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు. దీంతో కలెక్టర్ ట్రాన్స్‌కో సీఎండీ దొరకు ఫోన్ చేసి వెంటనే కొత్తపాళెం ఫీడర్‌కు చెందిన రైతులకు కరెంటు సరఫరా సక్రమంగా జరిగే లా చర్యలు తీసుకోవాలని సూచించారు.  సబ్‌స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వెంకటరమణారెడ్డి, సోమశిల ఎస్‌ఈ సోమశేఖర్, డీఈలు రాఘవరా వు, రాజేం ద్రప్రసాద్, తహశీల్దార్ మాల్యాద్రి ఉన్నారు.    
 
 కావలి కాలువపై కలెక్టర్ పర్యటన
 దగదర్తి: మండలంలో కాట్రాయపాడు నుంచి బోడగుడిపాడు సమీపంలో ఉన్న వెంకటేశ్వరపాళెం మేజర్ చానల్ వరకు కావలి కాలువపై  కలెక్టర్ శ్రీకాంత్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా బోగోలు, జలదంకి మండలాలకు చెంది న రైతులు తమ పొలాలు ఎండిపోకుండా ఉండేందుకు సాగునీరు అందివ్వాలని కో రారు. ప్రస్తుతం కావలి కాలువలో వస్తు న్న సాగునీరు పంట పొలాలకు సరిపోవడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకుని వ చ్చారు. కావలి కాలువ నుంచి జలదంకి మండలంలోని చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సరిపడి సాగునీరు అంద క ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయన్నారు. కాలువలో నీటి మట్టాన్ని పెంచాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ పం టలు ఎండిపోకుండా చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. ఆయన వెంట  ఆర్డీఓ వెంకటరమణారెడ్డి, దగదర్తి తహశీల్దార్ జయప్రకాష్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు  పాల్గొన్నారు.  
 
  రైతులకు అండగా నిలుస్తాం
 బిట్రగుంట: శ్రీవెంకటేశ్వరపాళెం మేజర్ ఆయకట్టు రైతులకు అండగా నిలిచి పైర్లు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు  కలెక్టర్ శ్రీకాంత్ అన్నారు. కావలి కాలువ 30వ కిలో మీటరు వద్ద ఎస్వీపీఎం రెగ్యులేటర్‌ను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువకు 400 క్యూసెక్కుల నీరు అందుతుండగా శ్రీవెంకటేశ్వరపాళెం మేజర్‌కు 110 క్యూ సెక్కులు, మిగిలిన నీటిని చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు.
 
 కలెక్టర్ మాట్లాడుతూ కొండబిట్రగుంట ప్రాంతంలోని పైర్లు కాపాడేం దుకు శ్రీవెంకటేశ్వరపాళెం మేజర్‌కు నీటి ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు ఎస్వీపీఎం ద్వారా రైతులకు సాగునీరు అందించనున్నామన్నా రు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ పైర్లను సంరక్షించుకోవాలని సూచించారు. ఆయన వెంట కావలి ఆర్డీఓ వెంకటరమణారెడ్డి, సోమశిల, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement