పనిదొంగలపై 420 కేసు నమోదుచేయిస్తా | collector fired on officials | Sakshi
Sakshi News home page

పనిదొంగలపై 420 కేసు నమోదుచేయిస్తా

Oct 19 2017 7:52 AM | Updated on Mar 21 2019 8:35 PM

collector fired on officials - Sakshi

మాట్లాడుతున్న కలెక్టర్‌ బాబూరావునాయుడు

ముద్దనూరు/ఎర్రగుంట్ల: ప్రజల డబ్బును జీతంగా తీసుకుంటున్నారు.. వారం రోజులనుంచి చెబుతున్నా మీకు బుర్రకెక్కలేదు..,గ్రామాల్లోకి వెళ్లి మరుగుదొడ్లు లేని వారి జాబితా సేకరించలేదు..మీరు దొంగలైతే నేను గజదొంగని, స్థానికంగా నివాసం లేకుండా హెచ్‌ఆర్‌ఏ తీసుకుంటున్నారు.. విధులనుంచి తప్పిం చుకోవడానికి ఎవరైనా మెడికల్‌ లీవ్‌లో వెళితే, మెడికల్‌ బోర్డుకు రెఫర్‌చేస్తా.. తప్పని తేలితే అటువంటివారి పై 420 కేసు నమోదుచేయిస్తా అని జిల్లా కలెక్టర్‌ బాబూరావునాయుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.బుధవారం సాయంత్రం ముద్దనూరు, ఎర్రగుంట్లలో  మండల  మరుగుదొడ్ల నిర్మాణంపై సమీ క్షా సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ మరుగుదొడ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులు ప్రణాళిక లేకుండా జాబితాను తయారుచేశారని,గ్రామాల్లోకి వెళ్లకపోతే లక్ష్యాన్ని ఎలా సాధిస్తారన్నారు. 

గడువులోగా లక్ష్యాన్ని సాధించలేకపోతే అధికారులపై కఠిన చర్యలుంటాయని అన్నారు. ఈనెల 20వతేదీనుంచి నేనే స్వయంగా గ్రామాల్లోకి వెళ్తానని,తన అనుమతి లేకుండా ధీర్ఘకాలిక  సెలవులో ఏ అధికారి వెళ్లకూడదని కలెక్టర్‌ హెచ్చరించారు.వార్డు స్థాయినుంచి ఎన్ని మరుగుదొడ్లు నిర్మించాలి..  కేటాయించిన అధికారి పేరు..ఇంటి నంబరు తదితర వివరాలు పొందుపరుస్తూ జాబితా సిద్ధంచేయాలని చెప్పారు. 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ స్పెషల్‌ఆఫీసర్‌ ఇన్నయరెడ్డి, తహసీల్దారు రమ,ఎంపీడీవో మనోహర్‌రాజులను ఆదేశించారు.

సర్వేలు అవాస్తమని తెలితే చర్యలు
జమ్మలమడుగు: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అధికారులు మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి చేసిన సర్వే అవాస్తమని తేలితె సర్వే నిర్వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ బాబూరావు నాయుడు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్పెషలాఫీసర్‌ విజయలక్ష్మీ ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలని సూచించారు. నవంబర్‌ చివరి నాటికి లక్ష్యం పూర్తి చేసేవిధంగా అధికారులు కృషి చేయాలన్నారు.

వీరేమన్నా లెక్కల మాస్టార్లా!
ఎర్రగుంట్ల: మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యంలో భాగంగా మండలస్థాయి అధికారులు తయారు చేసిన ముందస్తు ప్రణాళిక తప్పుగా ఉందని కలెక్టర్‌ బాబూరావునాయుడు పేర్కొన్నారు. బుధవారం ఎర్రగుంట్లలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వే జాబితాల్లో అన్నీ అంకెలు పెట్టారు.మీరేమన్నా లెక్కల మాస్టార్లా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామాలకు సర్వే సక్రమంగా చేయాలని చెప్పారు.   ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీఓ శివకుమారిలతో పాటు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

 గడువులోగా పూర్తి చేయాలి
మైలవరం: గ్రామాల్లో గడువులోగా మరుగుదొడ్లను పూర్తి చేయాలని కలెక్టర్‌ బాబూరావు నాయుడు పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీఓ సభా భవణంలో మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యం పూర్తి చేయకపోతే అధికారులు ఇంటిబాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. మండల స్పెషల్‌ అఫీసర్‌ అనిత, ఎంíపీyీఓ నారాయణరెడ్డి,  సాయినాధరెడ్డి,  పర్వతరెడ్డి, సరస్వతి, ఏఇ విశ్వనాథ్, పంచాయితీ సెక్రటరీలు, వీఆర్‌ఓలు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement