కోడి పందాలపై పోలీసుల పంజా | cock fights in vizag | Sakshi
Sakshi News home page

కోడి పందాలపై పోలీసుల పంజా

Mar 15 2015 7:00 PM | Updated on Aug 20 2018 4:27 PM

విశాఖ జిల్లా కోటవురట్ల మండలం ఆక్సాయిపేట గ్రామంలో భారీ స్థాయిలో కోడి పందాలు నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విశాఖపట్నం: జిల్లాలోని కోటవురట్ల మండలం ఆక్సాయిపేట గ్రామంలో భారీ స్థాయిలో కోడి పందాలు నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 25 నుంచి 30 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

 

ఆదివారం సాయంత్రం గ్రామంలో భారీ స్థాయిలో పందాలు నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ దాడిలో పట్టుబడిన వారిలో విశాఖ జిల్లాకు చెందిన వారితో పాటు ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement