గోదావరి వరదలపై సీఎం జగన్‌ సమీక్ష | CM YS Jaganmohan Reddy Talks About Godavari Floods With CS And Home Minister | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రిని కలిసిన కియా సీఈవో, ఎండీ

Aug 5 2019 5:52 PM | Updated on Aug 5 2019 7:12 PM

CM YS Jaganmohan Reddy Talks About Godavari Floods With CS And Home Minister - Sakshi

గోదావరి వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సీఎస్‌, ఆర్థిక మంత్రి, హోం మంత్రితో సమీక్ష నిర్వహించారు.

సాక్షి, అమరావతి: గోదావరి వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సీఎస్‌, ఆర్థిక మంత్రి, హోం మంత్రితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. బాధితులకు ఉదారంగా సాయం చేయాలన్నారు. సహాయక చర్యల్లో జాప్యానికి వీల్లేదని హెచ్చరించారు. మూడు రోజుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధరణ పరిస్థితులు తీసుకు రావాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సంబంధిత మంత్రులు పర్యటించాలని పేర్కొన్నారు. తాగునీటి కొరత లేకుండా, అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జగన్‌ సూచించారు.

జగన్‌ను కలిసిన కియా ప్రతినిధులు
అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటులో కొత్తకారు ఆవిష్కరణకు ఆహ్వానించడానికి కియా ప్రతినిధులు సోమవారం సీఎం జగన్‌ను కలిశారు. ఈ నెల 8న కియా కొత్త కారు ‘సెల్తోస్‌’ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కియా ఎండీ, సీఈవో కుక్‌ హ్యూన్‌ షిమ్, సీఏవో థామస్‌ కిమ్‌.. సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెనుగొండ ప్లాంటు ద్వారా ఏడాదికి 3 లక్షల కార్లు ఉత్పత్తి చేయగలమని తెలిపారు. భవిష్యత్తులో ఏడు లక్షల కార్లు ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement