నేడు విశాఖకు సీఎం వైఎస్‌ జగన్‌ రాక | CM YS Jagan To Visit Visakhapatnam Today | Sakshi
Sakshi News home page

నేడు విశాఖకు సీఎం వైఎస్‌ జగన్‌ రాక

Sep 6 2019 8:43 AM | Updated on Sep 6 2019 9:37 AM

CM YS Jagan To Visit Visakhapatnam Today - Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విశాఖ వస్తున్నారు. ప్రత్యేక విమానంలో ఉదయం 10.15 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారని, కొద్ది సేవు అక్కడే ఉండి.. ఆ తర్వాత హెలికాప్టర్‌లో శ్రీకాకుళం వెళతారని జిల్లాకలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. సీఎంతోపాటు హెలికాప్టర్‌లో మంత్రి మోపిదేవి వెంకటరమణ శ్రీకాకుళం జిల్లాలో  జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 5.20 గంటలకు సీఎం తిరిగి విశాఖ చేరుకుంటారు. 5.30 గంటలకు ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి గన్నవరం చేరుకుంటారని కలెక్టర్‌ వెల్లడించారు. కాగా సీఎం పర్యటన నేపథ్యంలో విశాఖ విమానాశ్రయంలో హై అలెర్టు ప్రకటించినట్టు నగర పోలీసు కమిషనర్‌ ఆర్‌.కె.మీనా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement