గత ప్రభుత్వ అవినీతిపై సీఎం జగన్‌ కీలక నిర్ణయం

CM YS Jagan Orders Inquiry On Electricity Irregularities - Sakshi

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ హాయంలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు
కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. 30 అంశాలపై విచారణ చేయిస్తామని.. సీసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థల సహకారం తీసుకుంటామని వెల్లడించారు. విద్యుత్‌రంగ సమీక్షా సమావేశంలో ఈమేరకు ప్రకటన చేశారు.

కరెంటు కొనుగోళ్లలో అక్రమాలపై దృష్టి పెట్టిన సీఎం జగన్‌.. సోలావర్, విండ్‌ పవర్‌ కొనుగోళ్లపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ రేట్లకన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్లు నష్టం వాటిల్లిందని, ఈ డబ్బును రికవరీ చేయాలని సీఎం ఆదేశించారు. కంపెనీలతో తిరిగి సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సోలార్, విండ్‌ కంపెనీలు దారికి రాకుంటే వారితో ఒప్పందాలు రద్దుచేయాలని సూచించారు. సోలార్, విండ్‌ కంపెనీలతో జరిగిన ఒప్పందాల్లో భారీ దోపిడీ జరిగినట్టు స్పష్టమైందన్నారు. ఈ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టొద్దని.. ఉన్నతాధికారులు, మంత్రి, ముఖ్యమంత్రి ఉన్నా సరే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సీఎం జగన్‌ను కలిసిన నావికాదళ అధికారులు
క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్‌ను తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్, నావికాదళ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top