ఆక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్‌ | CM YS Jagan Holds Cabinet Meeting | Sakshi
Sakshi News home page

ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం

Jul 18 2019 9:02 AM | Updated on Jul 18 2019 11:55 AM

CM YS Jagan Holds Cabinet Meeting - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులకు, చట్టసవరణ ముసాయిదాకు ఆమోదం తెలిపింది. వాటిలో భాగంగా.. కౌలు రైతుల కోసం రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. యాజమాని హక్కులకు భంగం కలగకుండా.. 11 నెలల పాటు రైతులు సాగు ఒప్పందం కుదుర్చుకునేలా బిల్లు తీసుకువచ్చింది. మద్య నిషేదం దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఇకపై మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించేలా రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. అలాగే అక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్‌ ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి రూ. 417 కోట్ల భారం పడనుంది.  చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం విక్రుతమాల గ్రామంలో ఏపీఐఐసీకి 149 ఎకరాలు అప్పగిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం విక్రుతమాల గ్రామంలో ఏపీఐఐసీకి 149 ఎకరాలు అప్పగిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీల జీతాల పెంపుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 11,114 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటుకు కేబినెట్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గడువు ముగిసిన స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల నియమాకానికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ గృహావసరాలకు 200 యూనిట్ల విద్యుత్‌ను అందించేందుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement