పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం పత్తికోళ్లలంకలో పాతకక్షలు శుక్రవారం మరోసారి భగ్గుమన్నాయి.
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం పత్తికోళ్లలంకలో పాతకక్షలు శుక్రవారం మరోసారి భగ్గుమన్నాయి. చేపల చెరువుల వివాదంలో చోటు చేసుకున్న ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరు మరణించగా... మరో ఐదుగురు గాయపడ్డారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు గ్రామానికి చేరుకుని... పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... ఏలూరు తరలించారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.