దందా చేసే వారికి సీఐ వత్తాసు | ci support danda | Sakshi
Sakshi News home page

దందా చేసే వారికి సీఐ వత్తాసు

Feb 22 2016 3:40 AM | Updated on May 25 2018 9:20 PM

దందా చేసే వారికి సీఐ వత్తాసు - Sakshi

దందా చేసే వారికి సీఐ వత్తాసు

దందాలు, భూకబ్జాలు, మహిళల మానప్రాణాలతో చెలగాటమాడే అసాంఘిక శక్తులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు.

వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ
సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

దందాలు, భూకబ్జాలు, మహిళల మానప్రాణాలతో చెలగాటమాడే అసాంఘిక శక్తులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. ఆంథోనిరెడ్డి కిడ్నాప్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆంథోనిరెడ్డిని మంత్రి పరిటాల సునీత అనుచరులుగా చెప్పుకుంటున్న మనోహర్‌నాయుడు, మరికొంతమంది కిడ్నాప్ చేసి రామగిరి మండలం ఎగువపల్లికి తీసుకెళ్లారు. అక్కడ మారుణాయుధాలతో బెదిరించి డబ్బు డిమాండ్ చేశారు. మంత్రి సునీత, పరిటాల శ్రీరామ్ అండదండలు ఉన్నాయంటూ బెదిరించారు.

డబ్బు ఇవ్వకపోతే హతమారుస్తామని, ముఖ్యనేతలను చంపుతామని హెచ్చరించారు. స్వయంగా మంత్రి పేరు చెప్పుకొని ఇంతటి అరాచకాలకు దిగుతుంటే పోలీసులు మాత్రం నిందితులకే అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం టూటౌన్ సీఐ శుభకుమార్.. ఆంథోనిరెడ్డి కిడ్నాప్ వ్యవహారాన్ని ఆర్థికలావాదేవీ కేసుగా ఎస్పీని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంథోనిరెడ్డి కిడ్నాప్ కేసులో నిజాయితీగా వ్యవహరిస్తున్న ఎస్‌ఐ హమీద్‌ఖాన్‌ను అధికార పార్టీ ఒత్తిళ్లతోనే వీఆర్‌కు పంపారు. ఇప్పటికైనా ఎస్పీ స్పందించి ఆంథోనిరెడ్డి కిడ్నాప్ కేసులో నిజానిజాలను నిగ్గుతేల్చాలి. దందాకు పాల్పడుతున్న మనోహర్‌నాయుడుపై చర్యలు తీసుకోవాలి. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్న సీఐపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement