గొర్రెలనూ, బర్రెలనూ వదలని చింతమనేని 

Chinthamaneni Corruption In Denduluru  - Sakshi

సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆఖరికి గొర్రెలకు ఇచ్చే నష్టపరిహారాన్ని కూడా వదలలేదని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి విమర్శించారు. శనివారం జరిగిన జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైథాన్‌ తుపాను సందర్భంగా తమ నియోజకవర్గంలో గొర్రెలు చనిపోయాయని, వాటి కోసం పశుసంవర్ధక శాఖ తయారు చేసిన లబ్ధిదారుల జాబితాలో మొదటిపేరు చింతమనేని భార్యది ఉండగా, రెండోపేరు ఆయన తండ్రి పేరు ఉందని మొత్తం జాబితా అంతా తప్పుల తడకగా ఉందని, దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళుతున్నట్టు ఆయన చెప్పారు. దీనిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

దీనిపై స్పందించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పశుసంవర్ధక శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకి గేదెలు అందలేదని, బినామీ పేర్లతో చింతమనేని తీసుకున్నారని మండిపడ్డారు. తన నియోజకవర్గంలో చెట్టున్నపాడు గ్రామంలో కూడా గొర్రెలు పెద్ద సంఖ్యలో చనిపోయినా ఇంతవరకూ నష్టపరిహారం రాలేదని ఉంగుటూరు శాసనసభ్యుడు పుప్పాల వాసుబాబు చెప్పారు. హర్యానా నుంచి గేదెలను తేవడం వల్ల అవి ఈ వాతావరణానికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాయని, వేరే ప్రత్యామ్నాయం చూడాలని చింతలపూడి శాసనసభ్యులు వీఆర్‌ ఎలిజా కోరారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top