బాలుడి అదృశ్యం | child missing in peddakadabur | Sakshi
Sakshi News home page

బాలుడి అదృశ్యం

Sep 23 2015 5:50 PM | Updated on Sep 3 2017 9:51 AM

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో మహేంద్ర (15) అనే బాలుడు అదృశ్యమయ్యాడు.

పెద్దకడబూరు: కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో మహేంద్ర (15) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. మంగళవారం ఉదయం గొర్రెలు కాయటానికి వెళ్లిన మహేంద్ర సాయంత్రమైనా ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. గ్రామానికి సమీపాన ఉన్న చెరువు కట్టమీద బాలుడికి సంబంధించిన చెప్పులు, సైకిల్, అన్నం బాక్సు ఉన్నాయి.

ప్రమాదవశాత్తూ చెరువులో పడి ఉంటాడేమోనని అనుమానిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి బాలుడి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement