ఒకవైపు సినిమాలు..మరోవైపు టీవీ షోలతో ఫుల్ బిజీ అయిపోతుంది అనసూయ(Anasuya Bharadwaj). యాంకర్గా కెరీర్ని ప్రారంభించి..ఇప్పుడు నటిగా కొనసాగుతుంది. అయితే మధ్య మధ్యలో టీవీ షోలలోనూ మెరుస్తూ..అటు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె చేసే హడావుడి గురించి అందరికి తెలిసిందే. నెట్టింట చాలా యాక్టివ్గా ఉంటూ.. తన సినిమా అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది. నెటిజన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది పట్టించుకోకుండా..తను చెప్పాల్సిన విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది.
తాజాగా అనసూయ తన ఇన్స్టా ఖాతాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది. తనకు మేనేజర్గా పని చేసిన మహేంద్ర రిలీవ్ అయ్యారంటూ చెబుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది.
నా సుధీర్ఘమైన సీనీ ప్రయాణంలో తోడుగా ఉన్న నా మేనేజర్ మిస్టర్ మహేంద్ర.. తన పదవి నుంచి రిలీవ్ అవుతున్నారు. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎన్నో ఏళ్ల మా అనుబంధంలో ఎంతో నేర్చుకున్నాం. ఇన్నాళ్లుగా నాకు మేనేజర్‌గా ఆయన చూపిన సమయం, కృషి, నిబద్ధతకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇకపై ఏదైనా అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల కోసం, వృత్తిపరమైన విషయాల కోసం దయచేసి enquiry.anusuyabharadwaj@gmail.com మెయిల్ చేయండి. మీ కాంటాక్ట్ నెంబర్‌కి మా టీం కాంటాక్ట్ అవుతారు’ అని అనసూయ రాసుకొచ్చింది.


