అన్ని వర్గాలకు న్యాయం చేశాం: చంద్రబాబు | chandrababu satisfied with Andhra Pradesh budjet-2017 | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాలకు న్యాయం చేశాం: చంద్రబాబు

Mar 15 2017 3:27 PM | Updated on Jun 2 2018 2:33 PM

అన్ని వర్గాలకు న్యాయం చేశాం: చంద్రబాబు - Sakshi

అన్ని వర్గాలకు న్యాయం చేశాం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌(2017-18)పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌(2017-18)పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్‌ సమతూకంగా ఉందని, అన్ని వర్గాలకు న్యాయం చేశామని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేశామని, నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు ఇచ్చామని తెలిపారు. మంజునాథ్‌ కమిషన్‌ నివేదిక రాగానే కాపులకు రిజర్వేషన్పై నిర్ణయం తీసుకుంటామన్నారు.

బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. అలాగే బీసీ సబ్‌ ప్లాన్‌కు రూ.10వేల కోట్లు ఇచ్చామని, వచ్చే రెండేళ్లలో పది లక్షల ఇళ్లు కట్టిస్తామని వెల్లడించారు. వ్యవసాయ రంగం 14 శాతం వృద్ధి సాధించిందని చంద్రబాబు తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 1,56,999 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement