
మాట్లాడుతున్న తుమ్మలకుంట శివశంకర్
కడప కార్పొరేషన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 20న దీక్ష చేయాలనుకోవడం విచిత్రంగా ఉందని, దీక్షను సీఎం అపహాస్యం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నాయకులు తుమ్మలకుంట శివశంకర్ విమర్శించారు. మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి, దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగి రాష్ట్ర ప్రజల గౌరవాన్ని పెంచారన్నా రు.
వారికి మద్దతుగా రాష్ట్ర ప్రజలంతా రిలే నిరాహార దీక్షలు చేశారన్నారు. సీఎం చంద్రబాబు తన పుట్టిన రోజు ఏప్రిల్ 20వ తేది ఉపవాస దీక్ష చేస్తాననని చెబుతుండటం హాస్యాస్పదమన్నారు. ఎవరి కోసం, ఏం సాధించాలని సీఎం ఈ దీక్ష చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ముఖ్య మంత్రికి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉంటే దొంగ దీక్షలు మాని ఆమరణ దీక్ష చేపట్టాలని, అప్పుడే ఆయన్ను ప్రజలు నమ్ముతారని తెలిపారు. సీనియర్ నాయకులు అన్నయ్యగారి హరినాథ్, 20వ డివిజన్ ఇన్‌చార్జి శ్యాంసన్, అలీ పాల్గొన్నారు.