'ఇంకేం చేస్తాం...సభను రద్దు చేయండి' | Chandrababu naidu public meeting cancellation in Anantapur district | Sakshi
Sakshi News home page

'ఇంకేం చేస్తాం...సభను రద్దు చేయండి'

May 4 2014 9:09 AM | Updated on Aug 14 2018 5:54 PM

'ఇంకేం చేస్తాం...సభను రద్దు చేయండి' - Sakshi

'ఇంకేం చేస్తాం...సభను రద్దు చేయండి'

అనంతపురంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది.

అనంతపురంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. అనంతపురంలో తాను పాల్గొనే బహిరంగ సభకు జన సమీకరణ చేయాలని  చంద్రబాబు కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్, హిందూపురం టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్పలను ఆదేశించారు. అందుకు సదరు ఇద్దరు నేతలు అధ్యక్షుడి ఆదేశాలు తు.చ పాటించారు. జన సమీకరణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందుకు రూ.లక్షలు వెచ్చించేందుకు కూడా వారు సిద్ధ పడ్డారు.

 

కానీ చంద్రబాబు  సభ అనే సరికి మేము రామంటే రామని అనంత ప్రజలు భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో కందికంట, నిమ్మల కిష్టప్పలు తలలుపట్టుకుని కూర్చున్నారు. ఏమీ చేయాల్లో పాలుపోక చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. ఇంకేం చేస్తాం సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడండి అంటూ అధ్యక్షులవారు సెలవిచ్చారు. దాంతో ఇద్దరు నేతలు హమ్మయ్య అంటూ కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట, హిందూపురం టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్పలు ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు సభ రద్దు అయిందని ఆ నేతలు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement