చంద్రబాబుతో ఫిక్కీ ప్రతినిధుల భేటీ | Chandrababu Naidu held a meeting with representatives of FICCI | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో ఫిక్కీ ప్రతినిధుల భేటీ

Nov 4 2015 1:21 PM | Updated on Sep 3 2017 12:00 PM

చంద్రబాబుతో ఫిక్కీ ప్రతినిధుల భేటీ

చంద్రబాబుతో ఫిక్కీ ప్రతినిధుల భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఫిక్కీ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఫిక్కీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో డైరెక్ట్ సెల్లింగ్ పై ఫిక్కీ ప్రతినిధులు చంద్రబాబుకు నివేదిక అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో వృద్ధిరేటు పడిపోతోందని.. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని వృద్ధి శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఫిక్కీ బృందం ముఖ్యమంత్రికి సూచించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి తో పాటు.. ఫిక్కీ చైర్మన్ అన్షూ భద్రాజ , ఐడీఎస్ఏ ఛైర్మన్ రజత్ బెనర్జీ లు పాల్గొన్నారు.

అంతకు ముందు ఉదయం చంద్రబాబు నాయుడు బయోటెక్నాలజీ కార్యదర్శి విజయ రాఘవన్ తో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నా పరిశోధనా సెంటర్ల ఏర్పాటు పై  ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో బయోటెక్నాలజీ అభివృద్ది అవకాశాలపై ఆయన తో చర్చించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement