‘‘సకాలంలో బ్యాంకు రుణాలు ఇవ్వలేదు. సీజన్‌లో విత్తన వేరుశనగ కాయలు అందరికీ ఇవ్వలేదు. రైతులు, డ్వాక్రా
అనంతపురం క్రైం : ‘‘సకాలంలో బ్యాంకు రుణాలు ఇవ్వలేదు. సీజన్‌లో విత్తన వేరుశనగ కాయలు అందరికీ ఇవ్వలేదు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలపై చంద్రబాబు ఇచ్చిన హామీలు బుట్టదాఖలయ్యాయి. అబద్దాలతో గద్దెనెక్కిన చంద్రబాబుకు రైతుల ఉసురు తగిలి అడుగుడుగున అవమానాల పాలవుతున్నారు. బాబు.. ఇక చాలించండి.. మీ మోసాలు.. భరించలేకపోతున్నాం.. ఇక గద్దె దిగండి.’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ‘రైతన్నల కోసం ధర్నా’ను జిల్లా అధ్యక్షుడు ఎం.శంకర్‌నారాయణ అధ్యక్షతన నిర్వహించారు.
సీజీసీ సభ్యులు డాక్టర్ సిద్ధారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రాగే పరుశురాం, మీసాల రంగన్న, నదీమ్ అహమ్మద్, కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే జయరాంనాయక్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రారెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ నాయకుడు వీఆర్ వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యుపి నాగిరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి డి.దేవి, గౌస్‌బేగ్, పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, పెన్నోబిలేసు, మిద్దె భాస్కర్‌రెడ్డి, బండి పరుశురాం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ధనుంజయ యాదవ్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు పామిడి వీరాంజినేయులు, అధికార ప్రతినిధులు సీపీ వీరన్న, చింతకుంట మధు, పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, మహిళ విభాగం నగర అధ్యక్షురాలు బి. శ్రీదేవిరెడ్డి, మహిళ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, ఎల్లుట్ల మారుతినాయుడు, అంకి రెడ్డి ప్రమీల, షమీమ్, షాబీన్, పార్వతి, లక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజల సంక్షేమాన్ని గాలికి..
పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి, అబద్దా ల హామీలతో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నారు. విత్తన వేరుశనగ కాయల కోసం రైతులు పడిగాపులు కాస్తుంటే అధికార పార్టీ నాయకులు ఇసుక అక్రమ వ్యాపారంలో బిజీ అయిపోయారు. రైతులకు అందాల్సిన విత్తన కాయలపై అధికార పార్టీ చేతివాటం చూపింది. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు.. నోటు వ్యవహారం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
- ఎం. శంకర్‌నారాయణ, జిల్లా అధ్యక్షులు
ఆత్మగౌరవాన్ని మంటగలిపారు
ఓటుకు నోటు కేసులో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలిపారు. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. చంద్రబాబుకు నైతికత ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి.
- దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డి, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త
రైతులపై చిత్తశుద్ధి ఉందా?
జిల్లాలో రైతులకు 5 లక్షల క్వింటాళ్ల వేరుశనగ అసవరమైతే 2లక్షల క్వింటాళ్లు సరఫరా చేశారు. అసలు మీకు రైతులపై చిత్తశుద్ధి ఉందా? ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయండి.
- అత్తార్‌చాంద్ బాషా, కదిరి ఎమ్మెల్యే
ధనమదంతో పాలన
చంద్రబాబు ధనమదంతో పాలన సాగిస్తున్నారు. ఓ పక్క రైతులు విత్తన వేరుశనగ కాయలు అందక అల్లాడుతుంటే.. ఆయన మాత్రం కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనే పనిలో ఉన్నారు.
- కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే
నిధులన్నీ చిన్న బాబుకే
ప్రజల ప్రయోజనాల కోసం ఖర్చుపెట్టాల్సిన నిధులన్నీ చిన్నబాబు (లోకేష్) కార్యకర్తల సంక్షేమానికి వెళ్లుతున్నాయి. జిల్లాలో రైతులకు విత్తనకాయలు అందించకపోవడం దారుణం.
- కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే
అవినీతికి నిలువెత్తు నిదర్శనం
నేను చాలా నిజాయితీ పరున్ని అని చాటింపు వేసుకున్న చంద్రబాబు ఓటుకు.. నోటు వ్యవహారంలో ఏసీబీకి దొరికిపోయారు. దీంతో బాబు అవినీతికి నిలువెత్తు నిదర్శనమని తేలిపోయింది.
- కె. ఉషాచరణ్, కళ్యాణదుర్గం సమన్వయకర్త
రైతుల పరిస్థితి చూస్తే బాధేస్తోంది
ఒక వైపు అదును దాటుతోంది.. సకాలంలో వర్షాలు కురిశాయి.. కానీ విత్తనకాయలు ఇప్పటికీ లభిం చడం లేదు. జిల్లాలోని రైతుల పరిస్థితి చూస్తే బాధేస్తోంది. - వై. వెంకటరామిరెడ్డి,
గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త